ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈరోజు నుంచి వరుసగా రెండు రోజుల పాటు వివిధ ప్యాకేజీలను ప్రజల ముందుకు తీసుకు వస్తామని చెప్పారు. ఈ రోజు ప్రకటించిన ప్యాకేజీ వివరాలు.
ఈరోజు 15 రకాల నిర్ణయాలను ప్రకటించారు. అందులో 6 నిర్ణయాలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంస్ఎంఈ) కోసం, 2 ఉద్యోగులు, పీఎఫ్‌కు సంబంధించినవి, 2 ఎన్బీఎఫ్సీ, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, ఎంఎఫ్ఐలకు సంబంధించినవి, 1 డిస్కంల కోసం, 1 కాంట్రాక్టర్ల కోసం, 1 రియల్ ఎస్టేట్ వారి కోసం, 3 ట్యాక్స్ పేయర్లకు సంబంధించినవి ఉన్నాయి.
సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.3 లక్షల కోట్లు రుణాలు ఇస్తారు. వారు ఎలాంటి కొల్లేటరీ గ్యారెంటీ పెట్టకుండానే రుణాలు లభిస్తాయి. అక్టోబర్ 31, 2020 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 45 లక్షల ఎంస్ఎంఈలకు లాభం జరుగుతుంది. నాలుగేళ్లలో తిరిగి చెల్లించేలా వెసులుబాటు. 12 నెలల మారటోరియంతో రుణాలు లభిస్తాయి.
రూ.20 వేల కోట్ల ప్యాకేజీ. కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న కంపెనీల కోసం. ఇది 2 లక్షల సంస్థలకు లబ్ధి చేకూరుస్తుంది. ఎన్పీఏలో ఉన్న కంపెనీలు కూడా దీనికి అర్హమైనవి.
ఎంఎస్ఎంఈల కోసం రూ.50వేల కోట్ల ఈక్విటీ ఫండ్. కరోనా లాక్ డౌన్ వచ్చినా కూడా కొంచెం తట్టుకుని నిలబడిన వాటి కోసం. అలాంటి సంస్థల విస్తరణకు ఇది ఉపయోగపడుతుంది.
MSMEs అర్థం మార్పు. రూ.కోటితో పెట్టుబడి పెట్టినా అది సూక్ష్మ తరహా కంపెనీనే. టర్నోవర్ రూ.5కోట్ల వరకు ఉంటే దాన్ని సూక్ష్మ తరహా కంపెనీ అంటారు. రూ. కోటి పైన రూ.10 కోట్లలోపు పెట్టుబడి ఉంటే అది చిన్న తరహా కంపెనీ.
ప్రభుత్వంలో రూ.200 కోట్ల వరకు టెండర్లకు గ్లోబల్ టెండర్లకు అనుమతి లేదు. దేశంలోని చాలా ఎంస్ఎంఈలకు లబ్ధి జరుగుతుంది.
కరోనా తర్వాత వ్యాపారం, రవాణా, ఎగ్జిబిషన్ల నిర్వహణ వంటి అంశాల్లో ఎంఎస్ఎంఈలకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి, వారి కోసం E-మార్కెట్ సౌలభ్యం కల్పిస్తుంది. 45 రోజుల్లో చెల్లింపులు జరిపేలా సౌకర్యం.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.