కేంద్రం ‘కరోనా ప్యాకేజీ’... వీరి అకౌంట్లో డబ్బులు పడతాయి...

Central Package for CoronaVirus | ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో రూ.1,70,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.

news18-telugu
Updated: March 26, 2020, 2:19 PM IST
కేంద్రం ‘కరోనా ప్యాకేజీ’... వీరి అకౌంట్లో డబ్బులు పడతాయి...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Nirmala Sitharaman announce Package | కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ ప్రకటించిన వేళ.. దేశంలోని పేదల కోసం ప్రభుత్వం ఓ భారీ ప్యాకేజీ తీసుకొచ్చింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో రూ.1,70,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించారు. అందులో కొందరికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయాలని నిర్ణయించారు.

రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6000 అకౌంట్లో జమ చేస్తుందన్న విషయం తెలుసుకదా. ఆ పథకానికి సంబంధించి తొలి విడుత డబ్బులను రూ.2000 వెంటనే జమ చేస్తుంది. దీని వల్ల 8.70 కోట్ల మందికి లబ్ధి జరుగుతుందని కేంద్రం ప్రకటించింది.

జాతీయ ఉపాధిహామీ పథకం కింద ఇచ్చే డబ్బులను కొంచెం పెంచి రూ.2000 అకౌంట్లో జమ చేస్తారు. (5 కోట్ల కుటుంబాలకు లబ్ధి)

వృద్ధులు, వితంతువులు, పెన్షనర్లకు మూడు నెలల్లో రూ.1000 ఇస్తారు. ఒక్కో విడుత రూ.500 చొప్పున రెండు సార్లు ఇస్తారు. (3 కోట్ల మందికి లబ్ధి)మహిళా జన్ ధన్ ఖాతాలున్న వారికి నెలకు రూ.500 చొప్పున మూడు నెలలు జమ (20 కోట్ల మందికి లబ్ధి)

ఉజ్వల పథకం కింద గ్యాస్ పొందిన 8.3 కోట్ల కుటుంబాలకు మూడు నెలలకు సరిపడా వంట గ్యాస్ ఉచితం

స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణం రూ.10లక్షల నుంచి రూ.20లక్షలకు పెంపు
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు