Home /News /coronavirus-latest-news /

NIRMALA SITHARAMAN ANNOUNCE AFFORDABLE RENTAL HOUSING COMPLEXES FOR MIGRANT WORKERS AND URBAN POOR BA

Nirmala Sitharaman | వలస కూలీలు, పట్టణ పేదలకు తక్కువ అద్దెకే ఇళ్లు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు వలస వచ్చే కూలీలు, పట్టణాల్లో పేదల కోసం తక్కువ అద్దెకే ఇళ్లను అందివ్వాలని నిర్ణయించింది.

    కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు వలస వచ్చే కూలీలు, పట్టణాల్లో పేదల కోసం తక్కువ అద్దెకే ఇళ్లను అందివ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి, తక్కువ అద్దెకే పేదలకు అందిస్తుంది. ప్రభుత్వం భారీ ఎత్తున భవన నిర్మాణాలను చేపడుతుంది. ఆ కాంప్లెక్స్‌ను తక్కువ అద్దెకు పేదలకు అందిస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ పథకాన్ని చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నగరాల్లో ప్రభుత్వ ధనంతో నిర్మిస్తున్న భవనాలను ఇలా పేదలకు తక్కువ అద్దెకు ఇచ్చే కాంప్లెక్స్‌గా మారుస్తారు. పీపీపీ తరహాలో నిర్మించే వాటి గురించి ఏకగ్రీవంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, సంస్థలు తమ వద్ద పనిచేసే వారి కోసం సొంత స్థలంలో ఇలాంటి భవన నిర్మాణాలు చేపడితే వారికి రాయితీలు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏజెన్సీలకు కూడా ఇది వర్తిస్తుంది. దీనిపై సంబంధిత శాఖ పూర్తిస్థాయిలో గైడ్ లైన్స్ విడుదల చేస్తుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Atma Nirbhar Bharat Abhiyan, Nirmala sitharaman

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు