Nirmal Kaur: కరోనాతో మిల్కా సింగ్ సతీమణి కన్నుమూత.. ఆయన కూడా ఆస్పత్రిలోనే...

భర్త మిల్కాసింగ్‌తో నిర్మలా కౌర్

Milka singh wife Nirmal Kaur passes away: గత నెలలో మిల్కాసింగ్‌తో పాటు ఆయన భార్య నిర్మల కౌర్ కోవిడ్ బారినపడ్డారు. మే 24న నిర్మలా సింగ్ మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత రెండు రోజులకే మిల్కాసింగ్ కూడా కోవిడ్ 19, న్యుమోనియా సమస్యలతో అదే ఆస్పత్రిలో చేరారు

  • Share this:
    భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ (Milkha Singh) సతీమణి నిర్మల కౌర్ (85) కరోనాతో కన్నుమూశారు. మొహలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. మూడు వారాల పాటు కరోనాతో పోరాడి చివరకు ఓడిపోయారు. నిర్మల కౌర్ మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. కాగా, నిర్మల మిల్కా సింగ్ భారత మహిళా వాలీబాల్ జట్టు కెప్టెన్‌గా ఆ పనిచేశారు. పంజాబ్ ఉమెన్ స్పోర్ట్స్ డైరెక్టర్‌గానూ సేవలందించారు. నిర్మల కౌర్ మృతి పట్ల రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రీడా రంగంలో ఆమె చేసిన సేవలు మరవలేనివి అని పేర్కొన్నారు. మిల్కా కుటుంబ సభ్యుల సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా బారిన పడిన మిల్కా సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఐతే ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో భార్య అంత్యక్రియలకు కూడా హాజరుకాలేకపోతున్నారు.



    గత నెలలో మిల్కాసింగ్‌తో పాటు ఆయన భార్య నిర్మల కౌర్ కోవిడ్ బారినపడ్డారు. మే 24న నిర్మలా సింగ్ మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత రెండు రోజులకే మిల్కాసింగ్ కూడా కోవిడ్ 19, న్యుమోనియా సమస్యలతో అదే ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల తర్వాత కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు డాక్టర్లు డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత మిల్కాసింగ్ ఆరోగ్యం మళ్లీ విషమించడంతో ఆయన్ను ఛండీగఢ్‌లోని (PGIMER)కి తరలిచారు. ప్రస్తుతం ఐసీయూలో (ICU)కోవిడ్-19 చికిత్స పొందుతున్నారు. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా వైరస్ బారిన పడిన మిల్కా సింగ్ న్యూమోనియాకు గురయ్యారు. ఆయన ఊపిరితిత్తులు ఊపిరి తీసుకోవడానికి సరిగా సహకరించ లేదు. ఆస్పత్రిలో చేరిన సమయంలో మిల్కా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. అయితే డాక్టర్లు కోవిడ్ ప్రోటోకాల్స్ అనుసరించి మిల్కాకు చికిత్స చేయడంతో ప్రస్తుతం ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. క్రమంగా కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు.
    Published by:Shiva Kumar Addula
    First published: