Home /News /coronavirus-latest-news /

NIPAH VIRUS TENSION IN TELUGU STATES IT IS MORE EFFECT ON CORONA SECOND WAVE NGS

Nipah Tension: తెలుగు రాష్ట్రాల్లో నిఫా భయం.. మరో ప్రమాదం తప్పదా? అసలు నిఫా కథేంటి?

తెలుగురాష్ట్రాల్లో నిఫా భయం

తెలుగురాష్ట్రాల్లో నిఫా భయం

Tension in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకెండ్ వేవ్ ను మించిన భయం మొదలైంది.. నిఫా వైరస్ హెచ్చరికలతో రెండు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు.

  Nipah Virus Tension:  తెలుగు రాష్ట్రాలు (Telugu States) రెండినీ నిఫా వైరస్ ( Nipah Virus) భయపెడుతోంది. నిఫా అటాక్ చేస్తే చావు తప్పదా అనే భయం పపెరుగుతోంది? నిఫా పేరు చెబితేనే ఎందుకు అంతలా హడలిపోతున్నారు? కరోనా వైరస్  (Corona Virus) కంటే నిఫా డేంజరా? తెలుగు రాష్ట్రాలకు నిఫా ప్రమాదం పొంచి ఉందా? ఇంతకీ ఈ నిఫా ఏంటి? కరోనా కంటే డేంజర్ ఈ నిఫా వైరస్. అందుకే, నిఫా పేరు చెబితేనే జనంతోపాటు ప్రభుత్వాలు వణికిపోతున్నాయి. ఒకవేళ కరోనా మాదిరిగా నిఫా వైరస్ గాని స్ప్రెడ్ అయితే 40 నుంచి 70శాతం మంది మరణించే ఛాన్స్ ఉందంటున్నారు వైద్యులు. నిఫా వైరస్ లక్షణాలు కూడా కరోనా మాదిరిగానే ఉంటాయంటున్నారు నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ (Covid Second Wave) తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ(Kerala) ముందుంటోంది. ఇది చాలదన్నట్లు నిఫా వైరస్ (NiV) అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఉత్తర కోజికోడ్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ (Nipah Virus) బారిన పడి ఇటీవల మరణించాడు. దీంతో అతడిని కలిసిన వారిని ట్రేస్ చేసి ఐసోలేషన్‌లో ఉంచారు. అధిక మరణ రేటు ఉన్న ఈ వైరస్ (Virus) వ్యాప్తిని నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఇది కేవలం కేరళకే పరిమితం అయితే పరవాలేదు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కూడా వణికిస్తోంది.

  నిఫా హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. నిఫా వచ్చాక నియంత్రకన్నా రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దని.. అప్రమత్తంగా ఉండేలని హెచ్చరించినట్టు సమాచారం.

  ఇదీ చదవండి: స్టీల్ ప్లాంట్ అయిపోయింది.. ఇక ఎయిర్ పోర్టులపై ఫోకస్.. విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రైవేటీకరణ..!

  * నిఫా వైరస్ (Nipah Virus) అంటే ఏంటి?
  నిఫా అనేది జూనోటిక్ వైరస్(zoonotic virus). ఇది ముందు జంతువుల్లో పుట్టింది. తరువాత మానవులకు సోకింది. ఇలా వ్యాపించే వాటిని జూనోటిక్ వైరస్‌లు అంటారు. ఈ వైరస్ తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్, మెదడువాపు లేదా బ్రెయిన్ పీవర్‌కు కారణమవుతుంది. 1998- 99లో మలేషియాలోని నిఫా అనే గ్రామంలో ఈ వైరస్‌ మొదటిసారి విజృంభించింది. దీంతో ఆ గ్రామం పేరుమీదుగానే దీనికి నిఫా వైరస్ అని పేరు పెట్టారు.

  ఇదీ చదవండి:ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. సులువుగా ఇలా చెక్ చేసుకోండి.. పరీక్ష రాయని వారికి మరో ఛాన్స్

  నిఫా వైరస్ ఫ్రూట్ బ్యాట్ (Fruit Bat) లేదా ఫ్లయింగ్ ఫాక్సెస్ అనే గబ్బిలాల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ప్టెరోపోడిడే (Pteropodidae) కుటుంబానికి చెందిన ఈ గబ్బిలాలు చెట్లపై నివసిస్తూ పండ్లను తింటాయి. ఇవి దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా కనిపిస్తాయి.

  ఇదీ చదవండి: వెదురు కంజి టేస్టు చూస్తే అసలు వదలరు.. బరువు తగ్గించే ఔషధం.. నులి పురుగులకు చెక్

  వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?
  నిఫా వైరస్ సోకిన వారిలో తేలికపాటి నుంచి తీవ్రమైన వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో మెదడు వాపు (ఎన్సెఫాలిటిస్)తో పాటు మరణం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది. దీని బారిన పడిన వారిలో జ్వరం, మానసిక సమస్యలు, తీవ్రమైన బలహీనత, తలనొప్పి, శ్వాసకోశ సమస్యలు, దగ్గు, వాంతులు, కండరాల నొప్పి, మూర్ఛ, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్‌ ఇంక్యుబేషన్ కాలం 4-14 రోజుల వరకు ఉంటుంది. అంటే వ్యాధి సోకిన వారిలో లక్షణాలు బయటపడటానికి ఎక్కువ రోజులు పట్టవచ్చు. ఇది ఆందోళన కలిగించే అంశం.

  ఇదీ చదవండి: చంద్రుడు ప్రతిష్టించిన బెల్లం వినాయకుడు.. కోరిన కోర్కెలు తీర్చే గణపతి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎక్కడున్నాడు?

  నిఫా వైరస్ సోకితే రోగి కోమాలోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంటుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. చిన్న పిల్లల పాలిట ఇది యమ డేంజర్ అని చెబుతున్నారు. ముల్లు పోయి కత్తి వచ్చే అన్నట్టుగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. కరోనా కంటే మోస్ట్ డేంజర్ వైరస్ భయపెడుతున్నందున బీకేర్ ఫుల్ అంటున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Corona virus, Nipah, Telangana

  తదుపరి వార్తలు