లాక్‌డౌన్ నుంచి ఎన్నో సడలింపులు ఇచ్చినప్పటికీ.. రాత్రి వేళలో మాత్రం కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు దేశమంతటా కర్ఫ్యూ అమల్లో ఉంది. ఐతే కర్ఫ్యూ అమలుపై శనివారం అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్వి అజయ్ భల్లా లేఖ రాశారు. సరుకు రవాణా వాహనాలతో పాటు బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా ప్రయాణించే వారికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉందని స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో అనవసర కార్యకలాపాల నివారణకు, గుంపులుగా తిరిగే వారిని ఆపేందుకే కర్ఫ్యూని విధించామని లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 10,956 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 396 మంది మరణించారు. తాజా లెక్కలతో దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 297,535కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 147,195 మంది కోలుకోగా.. 8,498 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 141,842 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.