కరోనాకి వ్యతిరేకంగా న్యూస్18 నెట్వర్క్ యుద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో న్యూస్ 18 ఉర్దూ పాఠకులకు అండగా నిలుస్తోంది. వ్యాక్సిన్‌పై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పిస్తూ "వ్యాక్సిన్‌తోనే జీవితంపై విశ్వాసం" (జింగాడి కా యాకీన్ వ్యాక్సిన్) అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ప్రతీ పాఠకుడికి వ్యాక్సిన్(Vaccine) అవసరాన్ని తెలియజేస్తోంది. అంతే కాకుండా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని అందరికీ అందిస్తోంది.
కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ "వ్యాక్సిన్‌తోనే జీవితంపై విశ్వాసం" (Vaccine is the reality of life) అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి న్యూస్18 ఉర్దూతో మాట్లాడుతూ వ్యాక్సిన్ వద్దనుకోవడం ఇన్ఫెక్షన్ను కోరుకోడమేనని అన్నారు. టీకా తీసుకోకపోవడం ప్రమాదకరమని అన్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మైనారిటీ వ్యవహరాల శాఖ మంత్రి మాత్రమే కుండా.. మహారాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ వ్యవహరాల మంత్రి నవాబ్ మాలిక్, సమాజ్‌వాదీ పార్టీ చెందిన ప్రముఖ నాయకుడు అబూ అజామి కూడా దీనికి మద్దతు పలుకుతున్నారు. న్యూస్ 18 ఉర్దూ చొరవను వీరిద్దరు ప్రత్యేకంగా అభినందించారు. వ్యాక్సిన్ సరఫరా లేకపోవడం కేంద్రం వైఫలమ్యని వీరిద్దరు విమర్శించారు. సరిపడ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడే ప్రజలు తీసుకోగలుగుతారని.. అప్పుడే వారు కరోనా వైరస్ నుంచి రక్షించబడతారని అన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ పద్మశ్రీ మొహ్సిన్ వలీ, డాక్టర్ స్వాతి మహేశ్వరి కూడా పాలు పంచుకొన్నారు. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రముఖ గాయకుడు మహమ్మద్ వకీల్ ఆయన కుటుంబం విషాదంలో ఉన్నప్పటికీ ఈ ప్రచార కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రచారం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుందనే విశ్వాసంతో ఈ ప్రచారంలో పాల్గొన్నానని అన్నారు. . అంతే కాకుండా ప్రజల్లో అవగాహన పెరిగి వ్యాక్సిన్ వేసుకోవాలని.. వ్యాక్సిన్ ఆవశ్యకతను గుర్తు చేస్తూ కరోనాకు సంబంధించిన పాట పాడారు.
ఇండోర్‌లో ప్రసిద్ధ మాల్వా ఘరానాకు చెందిన నసీర్‌ఖాన్ ఈ ప్రచారంలో పాలు పంచుకొన్నారు. ఈ ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు.. వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించేందుకు సట్లూజ్ రహత్ కవితలను చదివారు. అపోహలు తొలగించడమే లక్ష్యం..
ప్రజల్లో వ్యాక్సిన్‌పై అపోహలు, భయాలు, అనుమానాలు తొలగించడమే న్యూస్ 18 ఉర్దూ ప్రముఖ లక్ష్యం. కొన్ని పుకార్ల కారణంగా చాలా మంది వ్యాక్సిన్లకు దూరంగా ఉంటున్నారు.. వారికి నిజాలు తెలిపి ఆ భయాలు పొగొట్టేందుకే ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రచారంలో మత ప్రచారకులు, పండితులు మద్దతు తెలిపారు. న్యూస్ 18 ఉర్దూ ఈ ప్రచారంలో టీకా ప్రాముఖ్యతను అందరికీ చేర్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నదే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.