హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Survey: స్కూళ్లు ఎప్పుడు తెరవాలి? ఫీజులు తగ్గించాలా? ఈ సర్వేలో మీ అభిప్రాయం చెప్పండి

Survey: స్కూళ్లు ఎప్పుడు తెరవాలి? ఫీజులు తగ్గించాలా? ఈ సర్వేలో మీ అభిప్రాయం చెప్పండి

Survey: స్కూళ్లు ఎప్పుడు తెరవాలి? ఫీజులు తగ్గించాలా? ఈ సర్వేలో మీ అభిప్రాయం చెప్పండి
(ప్రతీకాత్మక చిత్రం)

Survey: స్కూళ్లు ఎప్పుడు తెరవాలి? ఫీజులు తగ్గించాలా? ఈ సర్వేలో మీ అభిప్రాయం చెప్పండి (ప్రతీకాత్మక చిత్రం)

News18 Public Sentimeter | ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లు తెరవాలా? ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తే ఫీజులు తగ్గించాలా? మీ అభిప్రాయం ఈ సర్వేలో వెల్లడించండి.

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పట్లో స్కూళ్లు తెరుచుకునే పరిస్థితి లేదు. కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసుల్ని నిర్వహిస్తున్నాయి. ఇప్పట్లో కరోనా కేసులు తగ్గే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి స్కూళ్లు రీఓపెన్ చేసే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటీ? స్కూళ్లు తెరవాలా? ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలా? ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తే తల్లిదండ్రులు మొత్తం ఫీజులు చెల్లించాలా? ఫీజులు తగ్గించాలని స్కూళ్లను కోరతారా? ఈ కింది సర్వేలో మీ అభిప్రాయం చెప్పండి.

భారతదేశంలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 45720 కేసులు నమోదవగా 1129 మంది చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం 12,38,635 కేసులు నమోదు కాగా 29,861 మంది చనిపోయారు. 7,82,606 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం 4,26,167 యాక్టీవ్ కేసులున్నాయి.

First published:

Tags: AP Schools, Corona, Corona virus, Coronavirus, Covid-19, EDUCATION, Lockdown, News18, Online Education, School admissions, School fees, Telangana schools

ఉత్తమ కథలు