New Zealand Election: మళ్లీ కరోనా కేసులు..న్యూజిలాండ్‌లో ఎన్నికలు వాయిదా

New Zealand Election: మళ్లీ కరోనా కేసులు..న్యూజిలాండ్‌లో ఎన్నికలు వాయిదా

న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్(ఫైల్ ఫోటో)

New Zealand Election Delays: న్యూజిలాండ్‌(New Zealand)లో గత వారం రోజులుగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆ దేశంలో ఎన్నికలను 4 వారాల పాటు వాయిదావేస్తూ ప్రధాని జాసిండా ఆర్డెర్న్(Jacinda Ardern) నిర్ణయం తీసుకున్నారు.

  • Share this:
    న్యూజిలాండ్(New Zealand)లో 102 రోజుల తర్వాత గత వారం మళ్లీ కరోనా కేసులు నమోదుకావడంతో ఆ దేశంలో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను 4 వారాల పాటు వాయిదావేశారు. తాజా నిర్ణయం మేరకు సెప్టెంబర్ 19న జరగాల్సిన ఎన్నికలను అక్టోబర్ 17 నాటికి వాయిదావేశారు. విపక్షాలతో పాటు మిత్రపక్షాల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జాసిండా ఆర్డెర్న్(Jacinda Ardern) ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యూజిలాండ్‌లో 102 రోజుల తర్వాత గత మంగళవారం రోజున ఆ దేశంలో అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌లోని ఒకే కుటుంబంలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న(ఆదివారం) నాటికి ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49కి చేరుకుంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ నమోదుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాసిండా ఆర్డెర్న్ తెలిపారు. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా భయాల కారణంగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు విముఖత చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

    ఎన్నికలను వాయిదావేయాలని నిర్ణయం తీసుకునే ముందు...గత వారం రోజులుగా జాసిండా ఆర్డెర్న్ పలు రాజకీయ పార్టీల నేతలు, ఎన్నికల కమిషన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 17నాటికి ఎన్నికలు వాయిదావేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితిలోనే ఎన్నికలను రెండోసారి వాయిదావేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్డర్న్ స్పష్టంచేశారు.

    గత వారం కరోనా కేసులు నమోదుకావడంతో ఆ దేశంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ఆపేశాయి. తాజా నిర్ణయం ద్వారా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారానికి 9 వారాల సమయం ఉంటుందని ఆర్డర్న్ స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో జాసిండా ఆర్డెర్న్ మళ్లీ విజయం సాధిస్తారంటూ ఒపీనియన్స్ పోల్స్ అంచనావేస్తున్నాయి.
    Published by:Janardhan V
    First published: