అమెరికాను కరోనా మహమ్మారి కబలిస్తోంది. న్యూయార్క్ నగరంలో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. రోజుకు వందలు సంఖ్యల్ చనిపోతుండడంతో శవాలు గుట్టులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక్క న్యూయార్క్ నగరంలోనే 779 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ AFP తెలిపింది. అంతేకాదు అమెరికా వ్యాప్తంగా ఇవాళ కూడా వెయ్యి మందికి పైగా చనిపోయారు. దాంతో అమెరికాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,868కి చేరింది. ఇప్పటి వరకు అక్కడ 4 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 22వేల మంది కోలుకున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో దాదాపు 9వేల మంది పరిస్థితి విషమంగా ఉంది.
#BREAKING New York reports record 779 novel #Coronavirus deaths in 24 hours pic.twitter.com/Sh8sA01Tnz
— AFP news agency (@AFP) April 8, 2020
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు పెద్ద ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో.. అందరూ ఐక్యమత్యంగా కరోనాను ఎదుర్కొందామని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. కరోనా ఎలా వ్యాపించదన్న దానిపై తర్వాత సమీక్ష చేసుకోవచ్చని పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి పెద్ద ఎత్తున నిధులు పొందుతూ.. చైనాకు వంతపాడుతోందని మండిపడ్డారు. తమకు తప్పుడు సలహాలు ఇస్తూ వైరస్ వ్యాప్తికి కారణమైందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు అమెరికా నుంచి WHOకి నిధులను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14,69,631 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి 86,303 వేల మంది చనిపోయారు. ఇందులో ఒక్క యూరప్‌లోనే 60వేల మరణాలు నమోదయ్యాయి. అత్యధికంగా ఇటలీ 17,669 మంది చనిపోయారు. ఇక స్పెయిన్‌లో 14,673, అమెరికాలో 13,868, ఫ్రాన్స్‌లో 10,328, యూకేలో 7,097 మంది మరణించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.