Home /News /coronavirus-latest-news /

NEW VARIANT AFTER OMICRON WILL BE SPREAD FASTER THAN PRESENT VARIANT SAYS WHO SCIENTIST MARIA VAN KERKHOV AK

Omicron: ఒమిక్రాన్ తరువాత పుట్టుకొచ్చే వేరియంట్ అలా ఉంటుందా ?..WHO శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Omicron: సోషల్ మీడియాలో జరిగిన చర్చలో ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త మరియా వాన్ కెర్ఖోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ప్రపంచాన్ని కొంతకాలంగా టెన్షన్ పెడుతోంది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ఈ మహమ్మారి గత వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందిన ఒమిక్రాన్.. గత వేరియంట్ల తరహాలో మరణాలు నమోదు చేయకపోవడం చాలామందికి ఊరట కలిగించింది. అయితే ఒమిక్రాన్‌తో కరోనా ముగిసిపోతుందా లేక కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయా ? అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒమిక్రాన్‌తోనే కరోనాకు ఎండ్ గేమ్ అని కొందరంటే.. అలా అనుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించారు. తాజాగా ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందే కోవిడ్-19 కొత్త వేరియంట్లు త్వరలో ప్రపంచంలో కనిపించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

    ఒమిక్రాన్‌తో పాటు మరో కొత్త వేరియంట్‌ను త్వరలో ప్రపంచవ్యాప్తంగా చూడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి ఒకరు ఇటీవల తెలిపారు. అదే సమయంలో ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్త వెల్లడించారు. సోషల్ మీడియాలో జరిగిన చర్చలో ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త మరియా వాన్ కెర్ఖోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయని అన్నారు. కోవిడ్ పాత వేరియంట్ల తరహాలో ఒమిక్రాన్ ప్రమాదకరం కాదని వ్యాఖ్యానించారు.

    అయితే కరోనా తదుపరి వేరియంట్ ఒమిక్రాన్ కంటే ప్రమాదకరమైనదని హెచ్చరించారు. కాలం గడిచేకొద్దీ కరోనా వేరియంట్లు బలహీనపడతాయని, తక్కువ మంది అనారోగ్యానికి గురవుతారనే ప్రజలు భ్రమపడవద్దని మారియా అన్నారు. తదుపరి వేరియంట్ తక్కువ ప్రమాదకరంగా ఉంటుందని ఆశించవచ్చని.. కానీ కచ్చితంగా అలా జరుగుతుందని అనుకోవద్దని అన్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్ ఉన్నంత కాలం కోవిడ్-19 ప్రోటోకాల్‌ను పాటించాలని తెలిపారు. కరోనా తదుపరి వేరియంట్ వ్యాక్సిన్ నుండి తనను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు. ఇది ఒమిక్రాన్ కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందగలదని అంచనా వేశారు.

    మరోవైపు భారత్‌లో క‌రోనా ఉద్ధృతి కొన‌సాగుతోంది. నిన్న 2,86,384 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అలాగే నిన్న 573 మంది ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కొంది. నిన్న క‌రోనా నుంచి 3,06,357 మంది కోలుకున్న‌ట్లు వివ‌రించింది.

    Schools Reopening: విద్యాసంస్థల తెరవడంపై త్వరలోనే కేంద్రం కీలక సూచనలు ?

    Covid-19: దేశంలో కరోనా పరిస్థితి.. కొన్ని రాష్ట్రాల్లో అలా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఇలా.. కేంద్రం ప్రకటన

    ఇక ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 22,02,472 మందికి చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,63,84,39,207 డోసుల వ్యాక్సిన్లు వేశారు. దేశంలో క‌రోనాతో మొత్తం 4,91,700 మంది మృతి చెందారు. మొత్తం 72,21,66,248 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Omicron, World Health Organisation

    తదుపరి వార్తలు