కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చినా, ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి మాస్కు ధరించడం, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాలు ఇప్పటికీ కోవిడ్-19 సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలు చేస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో కోవిడ్ నిబంధనలు పాటించనందుకు ఒక పర్యాటకుడితో పుష్ అప్స్ (push-ups) చేయించారు అధికారులు. ఆ దేశంలోని రిసార్ట్ ద్వీపమైన బాలిలో జరిగిన ఈ సంఘటన ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇండోనేషియాలో మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానా చెల్లించాలి. జరిమానా కట్టలేనివారు 50 పుష్-అప్స్ చేయాలని కొత్త శిక్ష విధిస్తున్నారు. మాస్కు ఉన్నా, సరిగ్గా ధరించనివారికి 15 పుష్ అప్స్ శిక్షగా ఉంది. ఇక్కడికి విహార యాత్రలకు వచ్చే యూరోపియన్ టూరిస్ట్‌లతో వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీంతో మాస్కు ధరించని టూరిస్ట్‌లకు కూడా అధికారులు పుష్ అప్స్ శిక్ష విధిస్తున్నారు.
ఫేస్ మాస్కులు లేకుండా చాలా మంది విదేశీయులు పట్టుబడ్డారని ఇండోనేషియా భద్రతా అధికారి గుస్టి అగుంగ్ కేతుట్ సూర్యనేగర తెలిపారు. ఇలా పట్టుబడిన వారిలో చాలామంది వ్యక్తులు తమకు ఈ నియమాలు తెలియవని చెబుతున్నారు. కొంతమంది మర్చిపోయామని, మాస్క్ చిరిగిపోయిందని కూడా చెప్పారు. వీరందరికీ శిక్షలు విధిస్తున్నారు. 70 మంది వ్యక్తులు 1,00,000 ఇండోనేషియా రూపాయలు (7 డాలర్లు) జరిమానా చెల్లించారు. కానీ మరో 30 మంది విదేశీయులు మాత్రం తమ వద్ద డబ్బు లేదని చెప్పారు. దీంతో వారిని పుష్ అప్స్ చేయమని ఆదేశించారు. జరిమానా విధించిన వారిలో 80 శాతం యూరోపియన్లేనని సుస్టి అగుంగ్ తెలిపారు.
https://twitter.com/Marcellomj/status/1351796075913474048?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1351796075913474048%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Ffitting-punishment-tourists-roaming-around-without-masks-made-to-do-50-push-ups-in-bali-watch-4346880%2F
అక్కడ కొత్త శిక్షలు
COVID-19 నేపథ్యంలో బయటకు వచ్చేవారు తప్పనిసరిగా ఫేస్ మాస్క్‌లు ధరించాలని బాలి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ దేశంలో 9,17,000 వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. 26,000 మందికి పైగా చనిపోయారు. దీంతో నియమాలు పాటించని వారికి పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తున్నారు. ఇంతకు ముందు కూడా మాస్కు ధరించనందుకు ఇక్కడి అధికారులు కొత్త శిక్షలు విధించారు. పాడుబడ్డ ఇళ్లలో పెట్టి తాళాలు వేయడం, కోవిడ్-19తో చనిపోయిన వారికోసం సమాధులు తవ్వించడం వంటి శిక్షలు విధించారు.