Corona: కరోనా బాధితుల్లో వైరస్ ప్రభావం ఎంత ? ఈ టెస్టు‌‌తో తెలుసుకోవచ్చు..

ఫ్రతీకాత్మక చిత్రం

Covid 19: కరోనా వచ్చిన తర్వాత లక్షణాలు ఎక్కువగా ఉంటాయా? లేక కొద్దిలోనే తగ్గిపోతుందా? అన్న విషయాన్ని ముందే తెలుసుకోగలిగితే బాగుండు అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం.

  • Share this:
కరోనా.. ప్రస్తుతం అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. కరోనా వచ్చిన తర్వాత కొందరికి లక్షణాలు చాలా తక్కువగా ఉంటే మరికొందరికి మాత్రం సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇది ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. కరోనా వచ్చిన తర్వాత లక్షణాల ఆధారంగా ఇంట్లోనే చికిత్స తీసుకోవడం లేదా హాస్పిటల్‌లో చేరడం చేస్తుంటారు చాలామంది. కానీ ఇలాంటి సందర్భాల్లో చాలామందికి ఆరోగ్యం ఒక్కసారిగా సీరియస్‌గా మారి, హాస్పిటల్‌కి తీసుకెళ్లినా ఫలితం లేకుండా ఉన్న సందర్భాలు చాలా చూస్తున్నాం. అందుకే కరోనా వచ్చిన తర్వాత లక్షణాలు ఎక్కువగా ఉంటాయా? లేక కొద్దిలోనే తగ్గిపోతుందా? అన్న విషయాన్ని ముందే తెలుసుకోగలిగితే బాగుండు అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం.

అది ఇప్పటివరకు సాధ్యం కాలేదు కానీ ఇప్పుడు మాత్రం మీకు కరోనా వస్తే లక్షణాలు తీవ్రంగా ఉంటాయో లేక తక్కువగా ఉంటాయో సులువుగా తెలుసుకోవచ్చట. దీనివల్ల హెల్త్ కేర్ వర్కర్స్ ఎలాంటి వారిపై ముందుగా కేర్ తీసుకోవాలో తెలుసుకోవడానికి వీలుంటుందట. అమెరికన్ కెమికల్ సొసైటీ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలను కనుగొన్నారు. ఈ అధ్యయనం ఫలితాలను అనలిటికల్ కెమిస్ట్రీ అనే జర్నల్‌లో ప్రచురించారు.

కరోనా వల్ల రక్తంలోని బయోకెమిస్ట్రీలో జరిగే మార్పులను గుర్తించేందుకు ఈ రీసర్చర్లు ఓ పద్ధతిని వాడారు. ఇందుకు అటెన్యుయేటెడ్ టోటల్ రిఫ్లెక్టెన్స్ ఫోరియర్ ట్రాన్స్ ఫార్మ్ ఇన్ ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ (ATR-FTIR) పద్దతిని ఉపయోగించారు. ఇంతకుముందు ఈ పద్ధతిని కరోనాని గుర్తించేందుకు ఉపయోగించేవారు. FTIR కి సంబంధించిన రెండు వేర్వేరు స్పెక్ట్రంలు పరిశీలించగా 128 పేషంట్ల ప్లాస్మాలో కొద్దిగానే అయినా మార్పులు కనిపించాయట. వీటిని బట్టి ఎవరికి కరోనా చాలా ఎక్కువగా ఉంటుంది.. ఎవరికి తక్కువగా ఉంటుందన్న విషయం గుర్తించవచ్చట.

ఈ డేటాను ఆయా పేషంట్ల క్లినికల్ సమాచారంతో పోల్చి చూసిన పరిశోధకులు.. కరోనా తీవ్రతను కనిపెట్టేందుకు ఓ పద్ధతిని కనుక్కున్నారు. డయాబెటిస్ ఉందా లేదా చెక్ చేసి.. ఈ FTIR రెండు స్పెక్ట్రంలు పరిశీలిస్తే సరిపోతుందని వారు వెల్లడిస్తున్నారు. ఈ మోడల్ లో భాగంగా 30 మంది పేషంట్లకు 41.2 నుంచి 94.1 శాతం వరకు సెన్సిటివిటీని లెక్కించారు. వీరిలో కరోనా ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని ముందుగానే గుర్తించడం వల్ల వారికి ఆ తర్వాత కాలంలో అది చాలా సహాయపడింది అని నిపుణులు వెల్లడిస్తున్నారు. అంటే దీని ద్వారా కరోనా తీవ్రతను గుర్తించవచ్చన్నమాట.
Published by:Kishore Akkaladevi
First published: