NEW TENSION IN KERALA ONE SIDE OMICRON AFRAID ANOTHER SIDE BIRLD FLU CASES ARE INCREASED NGS
Bird Flu: కోళ్లు, గుడ్లు, మాంసం వినియోగం, అమ్మకాలపై నిషేధం? భయపెడుతున్న మరో వైరస్
మరో వైరస్ భయం
Bird Flu: ఒమిక్రాన్ టెన్షన్ ఓ వైపు తరుముకొస్తోంది.. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ గడగడలాడుతున్నాయి. ఇదే సమయంలో మరో వైరస్ భారత్ ను భయపెడుతోంది. అటు ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. వైరస్ దెబ్బతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది చాలదన్నట్టు మరో వైరస్ ఇబ్బంది పెడుతోంది.
New virus tension in India: ప్రపంచ దేశాలను మరోసారి కరోనా మహమ్మారి (Corona Virus) వణికిస్తోంది. ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా ప్రజలపై పంజా విసురుతూ వస్తోంది. ఇప్పటికే వివిధ రకాలుగా జన్యుపరమైన వృద్ధి చెందుతున్న కరోనా వైరస్... మ్యూటెంట్, డబుల్ మ్యూటెంట్, డెల్టా, డెల్టా ప్లస్.., ప్రస్తుతం ఒమిక్రాన్ (Omicron Variant) అంటూ రూపాంతరం చెంది మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. ఆఫ్రికా (Africa) నుంచి అమెరికా (America), ఐరోపా (Europe) దేశాలకు వ్యాపించిన ఈ ప్రమాదకర వేరియంట్.. భారత్ (India) లోనూ గుబులు రేపుతోంది. ఇప్పటికే భారత దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20 మార్క్ ను క్రాస్ చేసింది. ఇంకా చాలామంది రిపోర్ట్స్ రావాల్సింది ఉంది. ఇటవల నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిది ఒమిక్రాన్ లేదా సాధారణ వైరస్సా అన్నది తేలాలి అని ఉంది.
ముఖ్యంగా ఇటీవల వేల సంఖ్యలో విదేశీయులు భారత దేశానికి వచ్చారు. అందులో చాలామందికి పరీక్షలే నిర్వహించలేదు.. కొంతమంది అడ్రస్ లు కూడా దొరకడం లేదు. అందులో ఎంత మందికి సాధారణ వైరస్ ఉంది..? ఎంతమందికి ఒకిమిక్రాన్ ఉంది అన్నది తేలడం లేదు. ఇలా ఒమిక్రాన్ గురించి అతా టెన్షన్ పెడుతోంది,
ప్రస్తుతం ఒమిక్రాన్ పెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. వైరస్ దెబ్బతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇది చాలదన్నట్టు మరో వైరస్ కలకలం రేగింది. జనాల్లో మరింత ఆందోళన పెరిగింది.
కేరళ (kerala)లో బర్డ్‌ఫ్లూ (Bird flue) కలకలం రేగింది. అలప్పుళ జిల్లాలోని తకాళి పంచాయతీలో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మరింత విస్తరించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. పంచాయతీలోని 10వ వార్డు చుట్టూ ఒక కిలోమీటర్ పరిధిలో బాతులు, కోళ్లు, ఇతర పెంపుడు పక్షులను చంపాలని నిర్ణయించారు. ఇందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. స్థానికంగా పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ అలెగ్జాండర్ పశుసంవర్ధక, ఆరోగ్య, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు బాతులు, కోళ్లు, పక్షుల గుడ్లు, మాంసం వినియోగం, అమ్మకాలను నిషేధించారు. హరిప్పడ్ మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల దాదాపు 12 పంచాయతీల్లోనూ ఈ నిషేధాజ్ఞలు అమలు కానున్నాయి. మరోవైపు వలస పక్షులకు వైరస్ సోకిందో లేదో నిర్ధారించాలని అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా జిల్లాలో బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదిక సమర్పించాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.