హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

UK Virus: కరీంనగర్‌లో కొత్త రకం కరోనా వైరస్ టెన్షన్.. అసలేం జరిగిందంటే..

UK Virus: కరీంనగర్‌లో కొత్త రకం కరోనా వైరస్ టెన్షన్.. అసలేం జరిగిందంటే..

తెలంగాణ మ్యాప్

తెలంగాణ మ్యాప్

UK Virus: తెలంగాణలోని కరీంనగర్‌లో కొత్త రకం కరోనా వైరస్ టెన్షన్ మొదలైంది. ఇక్కడికి బ్రిటన్ నుంచి వచ్చినవారిపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు.

  బ్రిటన్‌లో వెలుగు చూసి కొత్త రకం కరోనా వైరస్ భారత్‌ను కూడా భయపెడుతోంది. రెండు వారాల ముందు నుంచి ఇప్పటివరకు బ్రిటన్ నుంచి వచ్చిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. కాగా.. తాజాగా తెలంగాణలోని కరీంనగర్‌లో కొత్త రకం కరోనా వైరస్ టెన్షన్ మొదలైంది. ఇక్కడికి బ్రిటన్ నుంచి వచ్చినవారిపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. బ్రిటన్ నుంచి తెలంగాణకు వస్తున్నవారి డేటాను వైద్య ఆరోగ్యశాఖ సేకరిస్తోంది. గత 15 రోజులుగా కరీంనగర్‌కు బ్రిటన్ నుంచి 16 మంది వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో 10 మంది నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. మరో ఆరుగురు ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లుగా తెలియడంతో వారి ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.

  మరోవైపు కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అవలంభిస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని.. డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1200 మంది UK నుండి తెలంగాణకు వచ్చినట్లు గుర్తించింది. వారి వివరాలు సేకరిస్తోంది. వారందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నామని.. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేసిన వారిలో ఇప్పటి వరకు ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదని తెలిపారు.

  డిసెంబర్ 9 తరువాత బ్రిటన్ నుంచి రాష్ట్రానికి నేరుగా వచ్చిన వారు లేదా బ్రిటన్ గుండా ప్రయాణించి వచ్చిన వారు దయచేసి వారి వివరాలను 040-24651119 నంబర్ కి ఫోన్ చేసి లేదా 9154170960 నంబర్‌కి వాట్సప్ ద్వారా అందించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్ రెండో స్టేజ్ వ్యాప్తి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రజలు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Corona Vaccine, Coronavirus, Karimnagar, Telangana, UK Virus

  ఉత్తమ కథలు