Home /News /coronavirus-latest-news /

NEW RESEARCH REVEALS COVID 19 VACCINES ARE LESS EFFECTIVE IN AGED PEOPLE WHEN COMPARED TO YOUNG PEOPLE AK GH

Covid vaccines: వాళ్లపై కోవిడ్ వ్యాక్సిన్ల పనితీరు నామమాత్రమేనా? తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid vaccines: కోవిడ్ వ్యాక్సిన్లు వృద్ధుల్లో చాలా తక్కువ యాంటీ బాడీలను అభివృద్ధి చేస్తున్నాయని తాజా అధ్యయనం తేల్చింది.

ఏ వ్యాక్సిన్ అయినా, సరే.. ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా పనిచేస్తుంది. వ్యాక్సిన్ పనితీరు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే కోవిడ్ వ్యాక్సిన్లు వృద్ధుల్లో చాలా తక్కువ యాంటీ బాడీలను అభివృద్ధి చేస్తున్నాయని తాజా అధ్యయనం తేల్చింది. ఒరెగాన్‌ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ ఈ పరిశోధన నిర్వహించింది. ఈ అధ్యయన ఫలితాలను ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించారు. రోగనిరోధక వ్యవస్థ తయారుచేసే రక్త ప్రోటీన్లను యాంటీబాడీస్ అంటారన్న సంగతి విధితమే. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంటాయి. అయితే ఈ యాంటీబాడీలు కరోనా (సార్స్‌-కోవ్‌-2) ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ వృద్ధులలో యాంటీబాడీలు తక్కువగా ఉన్నాయని వెల్లడి కావడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ లేటెస్ట్ లేబరేటరీ స్టడీలో 50 మంది వ్యక్తులు పాల్గొన్నారు. వీరంతా కూడా రెండు డోసుల ఫైజర్ టీకా తీసుకున్న తర్వాత పరిశోధనలో పాల్గొన్నారు. అయితే పరిశోధకులు వారి రక్తంలోని రోగనిరోధక ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. వయసును బట్టి 50 మందిని గ్రూపులుగా విభజించారు. అనంతరం వారి బ్లడ్ సీరంను కరోనా వైరస్, p1(బ్రెజిల్ రకం) వేరియంట్ ఉన్న టెస్ట్ ట్యూబ్స్ లోకి ఎక్కించారు. అయితే 70 నుంచి 82ఏళ్ల వ్యక్తులతో పోలిస్తే.. 20 ఏళ్ల వ్యక్తులలో ఏడు రెట్లు అధికంగా యాంటీబాడీస్ ఉన్నాయని తేలింది. ఈ ఫలితాల ఆధారంగా బలంగా ఉన్న యువతలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని పరిశోధకులు వెల్లడించారు. అలాగే, బలహీనంగా ఉన్న వృద్ధులలో యాంటీబాడీస్ తక్కువగా ఉత్పత్తి అవుతాయని తెలిపారు.

వృద్ధులకు టీకాలు వేసినప్పటికీ.. వారు కరోనా వేరియంట్‌ల బారినపడే అవకాశం ఉందని రచయిత ఫికాడు టాఫెస్సే చెప్పారు. టాఫెస్సే ఒరెగాన్ యూనివర్సిటీలో‌ని మెడిసిన్ స్కూల్‌ లో మాలిక్యులర్ మైక్రోబయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వృద్ధులలో యాంటీబాడీలు తక్కువగా ఉన్నప్పటికీ.. అవి కరోనాను నివారించడానికి సమర్థవంతంగా పనిచేస్తాయని ఆయన అన్నారు. చిన్నా.. పెద్దా భేదం లేకుండా అన్ని వయస్కులలో తీవ్రమైన అనారోగ్యాలను నివారించడానికి టీకాలు పనిచేస్తాయని ఆయన ఉద్ఘాటించారు. కరోనా వ్యాక్సిన్లు చాలా శక్తివంతమైనవని టాఫెస్సే వ్యాఖ్యానించారు. ఒరెగాన్ తో సహా అమెరికా అంతటా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడం లేదని ఆయన అన్నారు. తాము చేసిన పరిశోధనలు వ్యాక్సిన్ల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని ఆయన వెల్లడించారు.

టీకాల వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుందని.. కొత్త వేరియంట్లు పుట్టుకురావు అని ఆయన అన్నారు. ప్రధానంగా వృద్ధులకు ప్రాణాంతకంగా మారే వేరియంట్లు విజృంభించవని ఆయన అన్నారు. ఎంత ఎక్కువగా టీకాలను తీసుకుంటే అంత తక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. టీకాలు తీసుకున్నంత మాత్రాన వృద్ధులు సురక్షితంగా ఉంటారని అనుకుంటే పొరపాటేనని ఆయన అన్నారు. వారితో పాటు వారి చుట్టూ తిరుగుతున్న ప్రజలందరూ టీకాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Coronavirus, COVID-19 vaccine

తదుపరి వార్తలు