UV-C Sanitiser: కరోనా వైరస్‌ను చంపేస్తున్న యూవీ లైట్.. పూర్తి వివరాలు ఇదిగో..

ఇళ్లు, కార్యాలయాల్లో UVC శానిటైజర్‌లను ఏర్పాటు చేసుకుంటే కరోనా బారినపడే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో శానిటైజేషన్ చేసుందుకు కూడా ఉపయోగపడుతుదని వెల్లడించారు.

news18-telugu
Updated: September 19, 2020, 11:58 AM IST
UV-C Sanitiser: కరోనా వైరస్‌ను చంపేస్తున్న యూవీ లైట్.. పూర్తి వివరాలు ఇదిగో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కొందరు కరోనా రాకుండా అడ్డుకునే వాక్సిన్‌పై పరిశోధనలు చేస్తుండగా.. మరికొందరు వచ్చిన వారి శరీరం నుంచి కరోనానున తరిమికొట్టే ఔషధాలపై ప్రయోగాలు జరుపుతున్నారు. మరికొందరేమో అసలు దీని పుట్టు పూర్వోత్తరాలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్19కి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. కరోనా వైరస్‌లను తరిమికొట్టే శక్తి UV (అతినీల లోహిత )కాంతికి ఉన్నట్లు తాజాగా ఓ పరిశోధనలో తేలింది. 222 నానో మీటర్ల తరంగ ధైర్ఘ్యం కలిగిన UV C కాంతి వైరస్‌లను చంపేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలను అమెరికన్ జనరల్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్ కంట్రోల్‌లో ప్రచురించారు.

హిరోషిమా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు UV C పై అధ్యయనం చేశారు. కరోనావైరస్‌లను 30 సెకండ్ల పాటు 222 nm UVC కాంతిలో ఉంచితే 99.7 శాతం వైరస్‌లు చనిపోయాయి. UV C ని Far-UVCగా పిలుస్తారు. ల్యాబ్‌లో కరోనా వైరస్ ఉన్న ఓ పదార్థాన్ని ప్లేట్‌లో ఉంచారు. దాన్ని ప్లేట్ మొత్తం విస్తరించారు. కాసేపు ఆరబెట్టిన తర్వాత UVC లైట్ కింద ఉంచి కాంతి పడేలా ఏర్పాట్లు చేశారు. అలా 30 సెకన్ల పాటు ఉంచిన తర్వాత.. ఆ పదార్థాన్ని మళ్లీ పరీక్షించగా అందులో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. ఈ 222 nm UVC కాంతి వలన మనుషులకు ఎలాంటి హాని ఉండదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మానవ చర్మ నుంచి లోపలికి ఈ కాంతి వెళ్లలేదని తెలిపారు. 254 nm UVC కాంతి మాత్రం మనుషులకు హాని చేస్తుందని స్పష్టం చేశారు.

మనిషి శరీరంలో ఉండే కరోనా వైరస్‌ను UVC కాంతి చంపలేదు. కేవలం బయటి ఉపరితలాలపై ఉండే వైరస్‌లను మాత్రమే నిర్మూలిస్తుంది. కరోనా వ్యాధి సోకిన తర్వాత, దాని నుంచి బయటపడాలంటే మాత్రం ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. తక్కువ తీవ్రత హోమ్ ఐసోలేషన్‌లో ఉండి డాక్టర్లు సూచించిన మందులు వాడాలి. ఈ UVC లైట్ కేవలం శానిటైజర్‌గా పనిచేస్తుంది. ఇంట్లో ఈ యూవీసీ శానిటైజర్‌లను ఉంచితే క్రిమిసంహారం జరుగుతుంది. ఇళ్లు, కార్యాలయాల్లో UVC శానిటైజర్‌లను ఏర్పాటు చేసుకుంటే కరోనా బారినపడే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో శానిటైజేషన్ చేసుందుకు కూడా ఉపయోగపడుతుదని వెల్లడించారు.

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగాను UVC శానిటైజర్లు అందబాటులో ఉన్నాయి. మన దేశంలో ముంబైకి చెందిన నెవాన్ సొల్యూషన్స్ అనే కంపెనీ యూవీసీ శానిటైజర్లను తయారుచేస్తోంది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి ఎక్కడికైనా తీసుకెళ్ల గలిగే పోర్టబుల్ వేరియెంట్. మరొకటి ఒకే దగ్గర ఫిక్స్ చేసే స్టేషనరీ వేరియంట్. మనదేశంలో రూ.4 వేలకు ఈ యూవీసీ శానిటైజర్‌ను అందిస్తోంది నెవాన్ సొల్యూషన్స్.
Published by: Shiva Kumar Addula
First published: September 19, 2020, 11:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading