కరోనా వైరస్ సంక్షోభంలో ఉద్యోగం కోల్పోయారా? మీ ఉద్యోగానికి భద్రత లేదా? కొత్త జాబ్‌లో జాయిన్ అవాలనుకుంటున్నారా? ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరు ఇస్తారని అనుకుంటున్నారా? నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు ఇచ్చేందుకు కొత్త వెబ్‌సైట్ ప్రారంభమైంది. డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టింగ్ సంస్థ మార్కివిస్ 'మండే జాయినింగ్' పేరుతో ఓ పోర్టల్ ప్రారంభించింది. ఇందులో జాబ్ ఆఫర్స్ ఉంటాయి. ఉద్యోగులను నియమించుకోవాలనుకునే సంస్థలు ఇందులో రిజిస్టర్ చేసుకుంటాయి. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లో తమ స్కిల్స్‌కు మ్యాచ్ అయ్యే ఉద్యోగాలను ఎంచుకోవచ్చు. అంటే కంపెనీలను, నిరుద్యోగులను ఒకేచోట చేర్చే ప్లాట్‌ఫామ్ ఇది. ఇందులో నిరుద్యోగుల స్కిల్స్‌కు తగ్గ ఉద్యోగాలు ఉంటే వెంటనే జాయిన్ కావొచ్చు.
ONGC Jobs: ఓఎన్‌జీసీలో 4182 జాబ్స్... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీల భర్తీ
UPSC Jobs: మొత్తం 344 డిఫెన్స్ జాబ్స్... హైదరాబాద్‌లోనూ ఖాళీలు... అప్లై చేయండిలా
'మండే జాయినింగ్' పోర్టల్‌లో మీరు దరఖాస్తు చేసిన కొద్దిరోజుల్లోనే ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువ. అయితే ఇందులో రిజిస్టర్స్ చేసుకున్న సంస్థలు సూచించిన స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. మీకు సంబంధిత రంగంలో స్కిల్స్ ఉండే ఉద్యోగాలు సులువుగా పొందొచ్చు. ప్రస్తుతం చాలావరకు కంపెనీల్లో రెండు మూడు నెలలు నోటీస్ పీరియడ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల కొత్త కంపెనీల్లో జాయినింగ్స్ ఆలస్యం అవుతున్నాయి. కానీ ఈ పోర్టల్‌లో జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేసిన 14 రోజుల్లోనే ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 'మండే జాయినింగ్' పోర్టల్‌లో 37,000 మందికి పైగా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. 2020 చివరి నాటికి 1,00,000 మంది రిజిస్టర్ చేసుకుంటారని అంచనా.
Browse through genuine profiles and shortlist job seekers to fit your urgent vacancy requirement! Register with Monday Joining for a hassle-free profile screening and recruitment process.#employment #jobs #jobsearch #hiring #job #recruitment #career #work #careers #nowhiring pic.twitter.com/5Xq2QQEjMB
— Monday Joining (@MondayJoining) August 10, 2020
'మండే జాయినింగ్' పోర్టల్‌లో ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో జాబ్ డిస్క్రిప్షన్స్ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. కేవలం మీ రెజ్యూమె అప్‌లోడ్ చేస్తే చాలు. రిక్రూటర్లు మీ ప్రొఫైల్, స్కిల్స్, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ సెర్చ్ ద్వారా తెలుసుకుంటారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు మీరు సరిపోతారనుకుంటే మీకు సమాచారం లభిస్తుంది. ప్రస్తుతానికి ఇది ఉచిత ప్లాట్‌ఫామ్ అయినా త్వరలో సబ్‌స్క్రిప్షన్ మోడల్ ప్రారంభించే అవకాశముంది. ఇక ఇప్పటికే మార్కెట్‌లో నౌక్రీ, మాన్‌స్టర్, ఇండీడ్, షైన్ లాంటి జాబ్ సెర్చింగ్ ప్లాట్‌ఫామ్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటికి 'మండే జాయినింగ్' పోర్టల్ పోటీ ఇవ్వనుంది.
Army Jobs: ఇంటర్ పాసైనవారికి ఆర్మీలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Railway Jobs: రైల్వేలో 432 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనమీ-CMIE లెక్కల ప్రకారం ఆగస్ట్ 11 నాటికి భారతదేశంలో నిరుద్యోగ రేటు 7.9 శాతం ఉంది. అర్బన్ ప్రాంతాల్లో 9.7 శాతం ఉంటే రూరల్ ప్రాంతాల్లో 7.1 శాతం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 40.4 కోట్ల మంది ఉద్యోగులు ఉంటే జూన్‌లో మాత్రం 37.4 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. అంటే కరోనా వైరస్ సంక్షోభంలో 30 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
(ఈ ఆర్టికల్ మొదట Moneycontrol వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయింది. ఒరిజినల్ ఆర్టికల్‌ను ఇక్కడ చదవొచ్చు.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.