కోరలు చాస్తున్న కరోనా.. మరో లక్ష కొత్త కేసులు.. అమెరికాలో 96 వేల మరణాలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తూనే ఉంది. నిన్న కొత్తగా లక్ష కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లోనూ కొత్తగా లక్ష కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: May 22, 2020, 6:28 AM IST
కోరలు చాస్తున్న కరోనా.. మరో లక్ష కొత్త కేసులు.. అమెరికాలో 96 వేల మరణాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తూనే ఉంది. నిన్న కొత్తగా లక్ష కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లోనూ కొత్తగా లక్ష కేసులు నమోదయ్యాయి. నిన్న ఉదయానికి మొత్తం కేసులు 50,82,661 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 51,89,178 కు చేరింది. మరణాల సంఖ్య కూడా పెరిగింది. మొత్తం 3,34,072 మంది కరోనా సోకి మరణించారు. ఒక్క అమెరికాలోనే 96,295 మంది వ్యాధితో చనిపోయారు. ఇక, 20,78,557 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 27,76,549 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 45,635 మంది పరిస్థితి విషమంగా ఉంది. దేశాల వారీగా చూస్తే నిన్న ఒక్క రోజే అమెరికాలో 1,359, బ్రెజిల్ 1,153, మెక్సికో 424, యూకే 338, ఇటలీ 156, రష్యా 127, పెరూ 124, కెనడా 121 మంది కరోనాతో మరణించారు.
















































దేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా 1,620,457 96,295
రష్యా 317,554 3,099
బ్రెజిల్ 310,087 20,047
యూకే 250,908 36,042
ఇటలీ 228,006 32,486
పెరూ 108,769 3,148
కెనడా 81,324 6,152
మెక్సికో 56,594 6,090
Published by: Shravan Kumar Bommakanti
First published: May 22, 2020, 6:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading