AP Corona Update: వర్క్ ఫ్రం హోమే బెటర్: కొత్త గైడ్ లైన్స్ రూపొందించిన ఏపీ ప్రభుత్వం: ఏంటో తెలుసా?

AP Corona Update: వర్క్ ఫ్రం హోమే బెటర్:  కొత్త గైడ్ లైన్స్ రూపొందించిన ఏపీ ప్రభుత్వం: ఏంటో తెలుసా?

కొత్త కరోనా నిబంధనలు సూచించిన ఏపీ ప్రభుత్వం

ఏపీని కరోనా మళ్లీ భయపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం మళ్లీ కొత్త గైడ్ లైన్స్ ను రూపొందించింది. ఆ కొత్ గైడ్ లైన్స్ ఏంటో తెలుసా?

  • Share this:
    ఏపీలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసులు పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది. ప్రతి రోజు 200 లకు తగ్గకుండా కేసులు నమోదు అవుతుండడం భయపెడుతోంది. భారత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. మరోసారి కఠిన నిబంధనలు అమలు చేయడంపై ఫోకస్ చేసింది. కరోనా నిబంధనల విషయంలో ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసింది.

    ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో కోవిడ్ నిబంధనల్ని తప్పక అమలు చేయాలని మరోమారు ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున్న నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అవకాశం ఉన్నంత వరకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని మరో మారు అవలంభించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరిశ్రమలు, దుకాణ సముదాయాలు, ఫ్యాక్టరీల్లో నియంత్రణా చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

    రవాణా వాహనాలు, యంత్రాలు, ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు వైరస్ రహితంగా చేయాలని కంపెనీలను ఆదేశించింది ప్రభుత్వం. ముఖ్యంగా శానిటైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చేపట్టాల్సిందిగా స్పష్టం చేసింది. వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, దుకాణాల్లోకి ప్రవేశించే సమయంలో థర్మల్ స్కానింగ్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం విధిగా పాటించేలా చూడాలని స్పష్టంగా తెలిపింది. డైనింగ్ హాళ్లు, క్యాంటీన్లలో ప్రతీ రెండు గంటలకూ శానిటేషన్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఉద్యోగులు, సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయించేందుకు చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.

    రోజు రోజుకూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,165 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 218 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్కరు కూడా మరణించలేదని వైద్య శాఖ ఊపిరి పీల్చుకుంటోంది. అదే సమయంలో 117 మంది రికవరీ అయ్యారు. అయితే పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,92,740 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,83,759కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,186 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,795 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ.

    ఓవైపు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా జరుగుతున్నసమయంలో.. కేసుల పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది. అయితే అందుకు ప్రధాన కారణంగా ప్రజల్లో చాలామంది ఇంకా నిర్లక్ష్యం వీడడం లేదు. కనీసం నిబంధనలు పాటించడం లేదు.  అసలు మాస్కులు పెట్టుకోవాలి అన్న సంగతే మర్చిపోయినట్టు ఉన్నారు. చాలామంది రోడ్లపై  మాస్కులు లేకుండానే కనిపిస్తున్నారు. ఇక షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ లో జనాలు గుమిగూడుతున్నారు.. ఎక్కడా ఎవరూ ఫిజికల్ డిస్టెన్ష్ పాటించినట్టు కనిపించడం లేదు. అందుకే కేసులు  సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అయినా ప్రజల్లో నిర్లక్ష్యం తగ్గడం లేదు.
    Published by:Nagesh Paina
    First published: