NEW COVID VARIANT WORSE THAN OMICRON IN NEXT TWO YEARS WARNS UK EPIDEMIOLOGIST PVN
New Covid variant : ఒమిక్రాన్ కంటే దారుణమైన కొత్త కోవిడ్ వేరియంట్ రాబోతుందన్న యూకే ఎపిడమాలజిస్ట్!
కరోనా కొత్త వేరియంట్ (ప్రతీకాత్మక చిత్రం)
New Covid variant: ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేసింది కరోనా వైరస్. కరోనా పీడ పోయిందని కాస్త రిలాక్స్ కాగానే.. అదంతా భ్రమేనని మరోసారి నిరూపితమవుతోంది. కరోనా పుట్టినిల్లు చైనాలో కొన్నివారాలుగా నమోదవుతున్న కేసులు, మరణాలు కలవరపెడుతున్నాయి. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు,మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న వేళ
New Covid variant: ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేసింది కరోనా వైరస్. కరోనా పీడ పోయిందని కాస్త రిలాక్స్ కాగానే.. అదంతా భ్రమేనని మరోసారి నిరూపితమవుతోంది. కరోనా పుట్టినిల్లు చైనాలో కొన్నివారాలుగా నమోదవుతున్న కేసులు, మరణాలు కలవరపెడుతున్నాయి. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు,మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న వేళ ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేండ్లలో ఒమిక్రాన్ కంటే తీవ్రమైన కొత్త కరోనా వేరియంట్ పుట్టుకురావొచ్చని, అందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రిస్ విట్టీ హెచ్చరించారు. కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు చేరిందన్న విశ్లేషణలను ఆయన కొట్టిపారేశారు. ఆసియా, ఐరోపాలో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఇప్పటికే అనేక దేశాలు కొవిడ్ ఆంక్షాలను సడలించాయనీ, ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిస్థితులు స్థిరమైన స్థితికి చేరిందని అనుకోవడం సరికాదని అన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో వచ్చే కొత్త వేరియంట్ లు మరింత ప్రమాదకరంగా ఉండబోతున్నాయనీ హెచ్చరిస్తున్నారు. మనకు మరిన్ని సర్ప్రైజ్లు ఇవ్వడానికి వైరస్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే వేరియంట్ లు.. ఒమిక్రాన్ కంటే తీవ్రమైన, ప్రాణాంతక సమస్యలను కలిగిస్తాయని అన్నారు. వైరస్ ల నుంచి వచ్చే సవాళ్లు ఏ విధంగానూ తక్కువ అంచనా వేయకుండదనీ, వాటి ఆవిర్భావం, ప్రమాద స్థితి రోజురోజుకు గణనీయంగా మార్చగలవని విట్టి తెలిపారు. గతంలో ఎప్పుడు చూడని విధంగా.. ఈ వేరియంట్ల బారిన పడే వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. కరోనాపై పోరు ముగియడానికి ఇంకా చాలా సమయం ఉందని పేర్కొన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.