Home /News /coronavirus-latest-news /

NEW COVID VARIANT OMICRON SUB LINEAGE BA 2 UNDER INVESTIGATION 426 CASES REPORTED PVN

New Covid Variant BA.2? : యూకేలో కొత్త కోవిడ్ వేరియంట్!..అప్పుడే 426 కేసులు నమోదు

కరోనా వేరియంట్(ప్రతీకాత్మక చిత్రం)

కరోనా వేరియంట్(ప్రతీకాత్మక చిత్రం)

Covid Variant BA.2 : కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బ్రిటన్ లో కొత్తగా BA.2 అనే రకం వైరస్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ కేసులు 426 నమోదైనట్లు బ్రిటన్ అధికారులు తెలిపారు. ఇది కరోనా వేరియంట్ అయిన ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ భావిస్తున్నారు.

ఇంకా చదవండి ...
Covid Variant BA.2 :  కొత్త కొత్త వేరియంట్ల రూపంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ వైరస్ తగ్గిపోతుందనుకుంటున్న సమయంలో డెల్టా వేరియంట్ రూపంలో విరుచుకుపడిన కోవిడ్ ఆ తర్వాత ఒమిక్రాన్ రూపంలో మరోసారి ప్రపంచాన్ని కలవరపాటుకి గురి చేస్తోన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వేరియంట్లు ఒక దాని తర్వాత ఒకటి పుట్టుకుంటూ వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అలా వేరియంట్లకు కూడా కొత్త వేరియంట్లు పుట్టుకు రావడం కొత్త పరిణామం.

బ్రిటన్ లో కొత్తగా BA.2 అనే రకం వైరస్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ కేసులు 426 నమోదైనట్లు బ్రిటన్ అధికారులు తెలిపారు. ఇది కరోనా వేరియంట్ అయిన ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ భావిస్తున్నారు. కరోనా పుట్టిన తర్వాత పలు రకాల వేరియంట్లు పుట్టుకొచ్చాయి. అయితే వేరియంట్‌కు వేరియంట్ పుట్టడం బహుశా ఇదే ప్రథమం అని అంచనా వేస్తున్నారు. BA.2 వేరియంట్ పై విచారణ చేస్తున్నట్లు శుక్రవారం యూకే ప్రజారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇది ఒమిక్రాన్ తరహాలోనే వేగంగా వ్యాప్తి చెందుతోందని... అయితే అంత ప్రమాదకరంగా మాత్రం గుర్తించలేదని యూకే ప్రజారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ తరహాలో మ్యూటేషన్లు ఇందులో ఎక్కువ లేవన్నారు.

ALSO READ Pak pilot: విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. షిఫ్ట్ టైమ్ పూర్తయిందటూ పైలట్ జంప్.. చిక్కుకున్న ప్రయాణికులు

యూకే శాస్త్రవేత్తలు ఇప్పటికే యూకేతో పాటు డెన్మార్క్, ఇండియా, స్వీడన్ మరియు సింగపూర్‌లో ఈ కేసులు విస్తరిస్తున్నాయని అంచనా వేశారు . ఇప్పటికి మొత్తం నలభై దేశాలకు ఈ B.A.2 వ్యాప్తి చెంది ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా డెన్మార్క్‌లో అత్యధిక కేసులు ఉన్నట్లుగా చెబుతున్నారు. డెన్మార్క్‌లో, BA.2 వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సమాచారం. డెన్మార్క్‌లో, BA.2 వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సమాచారం. 2021 చివరి వారంలో డెన్మార్క్ లో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల్లో 20శాతం కేసులు ఇవేనని తేలింది. ఈ నెల రెండవ వారంలో ఇది 45శాతానికి పెరిగినట్లు సమాచారం. డెన్మార్క్‌లో ఇప్పుడు నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం బీఏ.2 రకానికి చెందినవేనని చెబుతున్నారు. డెన్మార్క్‌ సైంటిస్టులు ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌కు రెండు మ్యూటేషన్లు ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం డెన్మార్క్ యంత్రాంగం అంతా ఈ కొత్త రకం వేరియంట్ మీద పరిశోధనలు చేస్తోంది. డెన్మార్క్ కి చెందిన స్టాన్స్ సీరమ్ ఇనిస్టిట్యూట్ చేసిన ప్రాథమిక విశ్లేషణ ప్రకారం... BA.1తో పోలిస్తే BA.2 వల్ల హాస్పిటల్స్ చేరికల్లో ఎటువంటి తేడా లేదు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Covid -19 pandemic

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు