Covid new variant : కోవిడ్ ముప్పు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మల్లీ అలజడి రేగింది. ఇజ్రాయెల్‌లో మరో కొత్త కరోనా వేరియంట్(Covid new variant) వెలుగులోకి వచ్చింది. విదేశాలకు వెళ్లి వచ్చిన ఇద్దరు వ్యక్తులలో ఈ కొత్త వేరియంట్ గుర్తించబడని వేరియంట్ కనుగొనబడిందని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీఏ1 (ఒమిక్రాన్), బీఏ2 వేరియంట్ల జన్యువుల కలయికతో ఈ కొత్త వేరియంట్ ఉనికిలోకి వచ్చింది. ఈ వేరియంట్‌తో బాధపడుతున్న ఇద్దరు ప్రయాణికులు బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. PCR పరీక్ష చేసిన తర్వాత పాజిటివ్ గా తేలింది. వారి నమూనాలను సీక్వెన్సింగ్ కోసం పంపారు.
పాజిటివ్ వచ్చిన ద్దరు ప్రయాణికులకు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు తదితర సమస్యలు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు వేర్వేలు వేరియంట్ల జన్యువుల కలయికతో కొత్త వేరియంట్ పుట్టుకురావడం సాధారణ పరిణామమేనని ఇజ్రాయెల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ ప్రాఫెసర్ సల్మాన్ జర్కా తెలిపారు. ఒకే కణంలో రెండు రకాల (వేరియంట్) వైరస్‌లు ప్రవేశించిన సందర్భాల్లో ఇలా జరుగుతుందన్నారు. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు తగ్గుతున్నప్పటికీ బీఏ1 వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, మూడు సార్లు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆ దేశ ప్రధాని సూచించారు.
మరోవైపు,భారతదేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర , తెలంగాణ , గుజరాత్, కేరళ , కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలను గమనించిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆరు రాష్ట్రాలకు పరీక్షలు, చికిత్స, ట్రాకింగ్ మరియు టీకాపై దృష్టి పెట్టాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid, Israel, Omicron corona variant