Home /News /coronavirus-latest-news /

NEW COVID VARIANT C 1 2 MAY BE MORE INFECTIOUS SAYS STUDY SU GH

Corona Variant: వెలుగులోకి వచ్చిన మరో కొత్త కోవిడ్ వేరియంట్ C.1.2.. మరింత ప్రమాదకారి అంటున్న పరిశోధకులు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కాలం గడుస్తున్న కొద్దీ సరికొత్త వేరియంట్లతో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కాలం గడుస్తున్న కొద్దీ సరికొత్త వేరియంట్లతో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. దక్షిణాఫ్రికాతో సహా ప్రపంచంలోని అనేక ఇతర దేశాల్లో C.1.2 అనే కొత్త కరోనా వైరస్ వేరియంట్‌ను(New Covid variant) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వేరియంట్ మరింత వేగంగా, చాలా సమర్థవంతంగా వ్యాప్తి చెందుతుందని.. టీకాల అందించే రక్షణను సైతం తప్పించుకోగలదని తాజా అధ్యయనం వెల్లడించింది. దక్షిణాఫ్రికా(South Africa) జాతీయ అంటువ్యాధుల సంస్థ(NICD), క్వాజులు-నేటల్ రీసర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్​ఫామ్ సంస్థల శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ C.1.2 వేరియంట్ ను మే నెలలో సౌత్ ఆఫ్రికా దేశంలో మొదటిసారిగా గుర్తించామని వెల్లడించారు.

C.1.2 వేరియంట్ చైనా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఆగస్టు 24న MedRxiv ప్రిప్రింట్ రిపోజిటరీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, C.1.2... C.1తో పోలిస్తే గణనీయంగా పరివర్తన చెందింది. ఇది కరోనా ఇన్ఫెక్షన్లలో మొదటి స్థానంలో ఉన్న వంశాలలో ఒకటి. కాగా దక్షిణాఫ్రికాలో ఫస్ట్ వేవ్ సమయంలో ఈ రకం ఉత్పరివర్తనమే వ్యాప్తి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కనుగొన్న ఇతర ఆందోళనకర వేరియంట్, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్​తో కొత్త వేరియంట్ లో ఎక్కువ మ్యుటేషన్లను ఉన్నాయని పరిశోధకులు వివరించారు.

Hurricane Ida: అమెరికాను వణికిస్తున్న ఐదా హరికేన్.. ఫ్లైట్​లో ప్రయాణిస్తుండగా తీసిన తుఫాన్​ వీడియో వైరల్​

ప్రస్తుతం పుట్టుకొచ్చిన C.1.2 సీక్వెన్స్‌ అనేది మరిన్ని సీక్వెన్స్ విజృంభించడానికి ఒక సంకేతం కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాలో ఫస్ట్ వేవ్​లో తీవ్ర ప్రభావం చూపించిన C.1 రకంతో పోలిస్తే C.1.2 వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని అధ్యయనంలో తేలింది. ప్రతి నెల దక్షిణాఫ్రికాలో C.1.2 జన్యువుల సంఖ్యలో స్థిరమైన పెరుగుదలను అధ్యయనం గుర్తించింది. మేలో 0.2% జన్యువులే ఉంటే జూన్‌లో 1.6 శాతానికి, జూలైలో 2 శాతానికి జన్యువుల సంఖ్య ఎగబాకింది. దేశంలో బీటా, డెల్టా వేరియంట్‌లతో పోలిస్తే C.1.2 పెరుగుదల కూడా ఇది సమానంగా ఉంటుందని అధ్యయన రచయితలు చెప్పుకొచ్చారు.

Afghanistan News: ఇంకా అఫ్గాన్‌లోనే 20 మంది ఇండియన్స్.. రేపటితో ముగియనున్న అమెరికా బలగాల ఉపసంహరణ గడువు..

C.1.2 మ్యుటేషన్ రేటు 41.8%గా ఉందని వెల్లడించారు. అంటే ఏడాదికి 41.8 సార్లు C.1.2 వేరియంట్‌లో మార్పులు సంభవిస్తాయన్నమాట. అయితే ప్రస్తుతం ఉనికిలో ఉన్న వైరస్ వేరియంట్ల మ్యుటేషన్ రేట్లతో పోలిస్తే ఇది రెట్టింపు రేటు కావడం భయాందోళనలకు గురి చేస్తోంది. C.1.2 సీక్వెన్స్‌లలో సగానికి పైగా 14 మ్యుటేషన్లు ఉన్నాయి. అయితే కొన్ని సీక్వెన్స్‌లలో అదనపు వేరియేషన్స్ కూడా కనిపించాయి. N440K, Y449H అనే మ్యుటేషన్లు, కొన్ని యాంటీబాడీల నుండి రోగనిరోధకని సైతం ఎదిరించి అటాక్ చేయగలవు. ఇవి C.1.2 సీక్వెన్స్‌లలో కూడా ఉండటం ఆందోళనకరంగా మారింది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Coronavirus, Covid-19, South Africa

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు