కరోనా కొత్త వేరియంట్లు (Corona New Variant) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్ కేసులను గుర్తించారు. దక్షిణాఫ్రికా (South Africa)లో 30కి పైగా స్పైక్ మ్యుటేషన్ల (Spike Mutations) తో కరోనా కొత్త వేరియంట్ కేసులు బయటపడటంతో శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. కొత్త వేరియంట్లు రోగనిరోధకశక్తి నుంచి తప్పించుకునే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అధిక మొత్తంలో కనుగొన్న వైరస్ స్పైక్ మ్యుటేషన్లు ఆందోళన కలిగిస్తున్నాయని చెబుతున్నారు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ వైరాలజిస్ట్ డాక్టర్. టామ్ పీకాక్. ఇవి మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి తప్పించుకోవచ్చని ఆయన గురువారం తెలిపారు.
‘బి.1.1.529 (B.1.1.529) వేరియంట్ కేసులను ఆఫ్రికాలోని ఓ ప్రాంతంలో చాలా తక్కువ సంఖ్యలో గుర్తించాం. అయితే ఇది ప్రమాదకరమైన స్పైక్ ప్రొఫైల్ కలిగి ఉండటంతో ఎక్కువగా పర్యవేక్షించాల్సి ఉంది. ఇటీవల కాలంలో గుర్తించిన వేరియంట్లలో ఇది యాంటిజెనిక్ పరంగా అత్యంత ప్రమాదకరమైనది’ అని డాక్టర్ టామ్ పీకాక్ తెలిపారు.
కరోనాలో మరో భయంకరమైన వేరియెంట్.. అసాధారణ రీతిలో మ్యుటేషన్స్.. కేంద్రం హెచ్చరిక
* కొత్త వేరియంట్‌ను ఎక్కడ కనుగొన్నారు?
బి.1.1.529 (B.1.1.529) వేరియంట్‌ను బోట్స్వానా (Botswana) లో మొదటిసారి గుర్తించారు. ఇప్పటి వరకు జెనోమిక్ స్వీక్వెన్సింగ్ ద్వారా పది కేసులను నిర్ధారించారు.
* ఏయే దేశాల్లో కేసులు బయటపడ్డాయి?
నవంబరు 11న బోట్స్వానాలో మొదటి కేసును అధికారులు గుర్తించారు. మూడు రోజుల తరువాత దక్షిణాఫ్రికాలో అదే వేరియంట్ కేసు బయటపడింది. ఈ వేరియంట్ కేసును హాంకాంగ్ కూడా అధికారికంగా రికార్డు చేసింది. హాంకాంగ్ నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్లిన 36 ఏళ్ల వ్యక్తి అక్టోబరు 22 నుంచి నవంబరు 11 వరకు అక్కడే ఉన్నాడు. ఆ వ్యక్తి హాంకాంగ్‌లో క్వారంటైన్లో ఉన్నప్పుడు నవంబరు 13న ఈ ప్రత్యేక వేరియంట్ కేసును గుర్తించారు.
Russia : వణుకుతున్న రష్యా.. పెరుగుతున్న కోవిడ్ కేసులు కారణం ఇదేనా!
* ఇది ఇతరులకు వ్యాపిస్తుందా?
ఈ కొత్త వేరియంట్లో మ్యుటేషన్ పి881హెచ్( P881H) కనిపించింది. ఆల్పా, Mu, గామా, బి.1.1.318 వేరియంట్లలో కూడా ఈ మ్యుటేషన్‌ను గుర్తించారు. అయితే కొత్త వేరియంట్ ఎన్679 (N679) మ్యుటేషన్‌ను కూడా కలిగి ఉందని పరిశోధకులు కనుగొన్నారు. దీంతోపాటు ఆందోళనకరమైన వైరస్ రకాల్లో గుర్తించిన ఎన్5017వై (N5017Y) మ్యుటేషన్ కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు. ఇది వేరియంట్‌ను వ్యాపింపజేయడానికి సహాయపడుతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మనిషిలోని యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ - 2 (ACE2) గ్రాహకాలతో ఈ వైరస్ కలిసిపోతోందని గుర్తించారు. సార్స్ కోవ్ - 2 (SARS Co-2)లో గుర్తించిన స్పైక్ మ్యుటేషన్లలో P681H ఒకటి. ఇది వైరస్ వ్యాప్తిని పెంచుతుంది. కొత్త వేరియంట్లో గుర్తించిన D614G మ్యుటేషన్ కూడా వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.
* శాస్త్రవేత్తలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు
ఈ వేరియంట్ అత్యధిక సంఖ్యలో ఉత్పరివర్తనాలను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మూడు దేశాల్లో ఇప్పటి వరకు 10 కేసులు బయపడ్డాయి. ఈ కేసులు ప్రజలు, శాస్త్రవేత్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఉత్పరివర్తనాలు కరోనా వైరస్ రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోవడానికి సహాయపడతాయని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
Covid's 'Patient Zero: కరోనా రోగాన్ని తెచ్చింది ఈమే.. ఆ తర్వాతే అందరికీ సోకి.. ప్రపంచమంతటా వ్యాప్తి
* ఇది ఎయిడ్స్ రోగిలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ నుంచి ఉద్భవించిందా?
రోగనిరోధక శక్తి లేని వ్యక్తిలో దీర్ఘకాలిక సంక్రమణ ద్వారా ఈ వేరియంట్ ఉద్భవించే అవకాశం ఉందని యూసీఎల్ జెనెటిక్స్ ఇనిస్టిట్యూట్ కంప్యూటేషనల్ సిస్టమ్స్ బయాలజీ ప్రొఫెసర్, డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బలోక్స్ చెప్పారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తి.. అంటే హెచ్ఐవీ, ఎయిడ్స్ (HIV/AIDS)జబ్బులకు వైద్యం చేయించుకోని రోగి నుంచి ఈ వేరియంట్ ఉద్భవించి ఉండవచ్చని బలోక్స్ మీడియాకు వెల్లడించారు.
ప్రస్తుతం నాలుగు రకాల వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఆల్ఫా (బి.1.1.7, యూకే వేరియంట్ ), బీటా బి.1.351 ( దక్షిణాఫ్రికా వేరియంట్ ), గామా (పి1, బ్రెజిల్ వేరియంట్), డెల్టా (బి.1.617.2) వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Coronavirus, Covid-19, COVID-19 cases