NEW COVID MEDICINE WHEN GOING OUT JUST SPRAY THE NOSE AND CORONA WILL NOT COME NEW MEDICINE SOON EVK
Medical Research: బయటకు వెళ్లేటప్పుడు నేజల్ స్ప్రే చేసుకొంటే చాలు కరోనా రాదు.. త్వరలో కొత్త ఔషధం!
ప్రతీకాత్మక చిత్రం
Medical Research | కరోనా కట్టడికి శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కొత్తరకం ఔషధాన్ని తయారు చేస్తున్నారు. బహిరం ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ముక్కులో స్ప్రే చేసుకొంటే చాటు కరోనా రాకుండా ఉండేలా ఔషధాన్ని తయారు చేస్తున్నారు.
కరోనా కట్టడికి శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా (Australia) శాస్త్రవేత్తలు కొత్తరకం ఔషధాన్ని తయారు చేస్తున్నారు. రక్తం పలుచబడేందుకు వినియోగించే హెపరిన్ అనే ఔషధాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఔషధం చౌకగా లభిస్తుంది. నేజల్ స్ప్రేను వాడి ఓ కొవిడ్ రోగికి ఈ ఔషధాన్ని ముక్కులో పిచికారీ చేసే ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం అనంతరం రోగికి కరోనా సోకలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఔషధాన్ని 2022 చివరి నాటికల్లా అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. ఈ కొత్త ఔషధంతో వైరస్ వ్యాప్తిని బాగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే ప్రజలకు మరో అద్భుతమైన ఔషధం దొరికినట్టే అని అంటున్నారు.
ఎలా వాడాలి
- రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లేటప్పుడు స్ప్రే ను ముక్కు లో పిచికారీ చేసుకోవాలి.
- ఈ స్ప్రేను పీల్చినప్పుడు నేరుగా రక్తంలో కలవకుండా ముక్కు రంధ్రాల్లో ఉంటుంది
- ఈ ఔషధం రక్తంలో కలవకుండా ముక్కు రంధ్రాల్లో ఉండి కరోనా రాకుండా అడ్డుకుంటుంది.
కొనసాగుతున్న ప్రయోగాలు..
ఈ స్ప్రేకు సంబంధించి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు నేజల్ స్ప్రేలను పరీక్షించినట్టు సమచారం. అయితే కోవిడ్ ప్రయోగాల్లో హెపరిన్పై పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఔషధం మార్కెట్లో సులభంగా లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిశోధన కోసం అమెరికాలో విక్టోరియా రాష్ట్ర
ప్రభుత్వం 3 మిలియన్ డాలర్లను కేటాయించినట్టు సమాచారం. ఫిబ్రవరిలో మొదలుపెట్టిన ఈప్రయోగాల్లో భాగంగా కొవిడ్ రోగులున్న 400 గృహాల్లో దీనిని పరీక్షించనున్నారు.
ఇండియాలో ఒమిక్రాన్ కేసులు..
కేంద్రం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 213 కరోనావైరస్ (Corona Virus) యొక్క ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మంగళవారం 11 కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రంలో అటువంటి కేసుల సంఖ్యను 54కి తీసుకువెళ్లింది. రాజధానిలో ఓమిక్రాన్ కేసులు 57కి పెరిగాయి. ఢిల్లీ (Delhi), మహారాష్ట్ర (Maharashtra) లు దేశానికి అత్యధిక సంఖ్యలో కొత్త ఒమిక్రాన్ కేసులను ఈ ప్రాంతాల నుంచే వస్తున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 6,317 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 318 మరణాలు నమోదయ్యాయి.
కోవిడ్ -19 యొక్క ఓమిక్రాన్ (Omicron) వేరియంట్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (Disaster Management Authority) క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల నిర్వహణను అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకొంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.