ఒక సెకన్‌లోనే కరోనా పరీక్ష ఫలితం.. సాంకేతికతను అభివృద్ది చేసిన శాస్త్రవేత్తలు.. వారు ఏం చెప్పారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఒక సెకన్‌లో కరోనా నిర్ధారణ పరీక్షను పూర్తి చేసే సాంకేతికతను అభివృద్ది చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కోవిడ్ నిర్ధారణ పద్దతులతో పోల్చితే.. వేగవంతమైనదని చెప్పారు.

 • Share this:
  ఒక సెకన్‌లో కరోనా నిర్ధారణ పరీక్షను పూర్తి చేసే సాంకేతికతను అభివృద్ది చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కోవిడ్ నిర్ధారణ పద్దతులతో పోల్చితే.. వేగవంతమైనదని చెప్పారు. దీని ద్వారా కేవలం సెకన్ వ్యవధిలోనే కరోనా ఫలితం తెలుస్తుందన్నారు. బయోసెన్సార్స్‌ స్ట్రిప్ ద్వారా కరోనా పరీక్షను చేసే విధానాన్ని కనుగొన్నట్లు అమెరికాకు చెందిన ఫ్లోరిడా విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు.ఈ సెన్సార్ మార్కెట్‌లో ఉన్న గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్ట్‌ను పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ సెన్సార్‌తో పాటు చిన్న సైజు మైక్రోఫ్లూయిడ్ ఛానల్ ఉంటుంది. మైక్రోఫ్లూయిడ్ ఛానల్ లోపల కొన్ని ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వీటిలో ఒకదానికి బంగారు పూత ఉంటుంది. ద్రవ నమూనాలో కరోనా-సంబంధిత యాంటీబాడీ రసాయన పద్ధతి ద్వారా బంగారు ఉపరితలంపై అంటుకుంటుంది. కరోనా నిర్దారణ పరీక్ష జరిగే సమయంలో సెన్సార్ స్ట్రిప్స్.. కనెక్టర్ ద్వారా సర్క్యూట్ బోర్డ్ ద్వారా జత చేయబడి ఉంటాయి.

  కరోనా లక్షణాలున్న వ్యక్తి లాలాజలాన్ని స్ట్రిప్‌లోకి తీసుకున్నప్పుడు.. వ్యాధి నిర్ధారణ అయితే యాంటీజన్‌లు బంగారుపూత కలిగిన కాథోడ్‌కు అంటుకుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సెన్సార్ సిస్టమ్‌లోని సర్క్యూట్ బోర్డ్ ఎలక్ట్రికల్ సిగ్నల్‌ను విస్తరించడం కోసం ట్రాన్సిస్టర్ ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. ఈ సిగ్నల్‌ ఓ సంఖ్యగా మారి తెరపై కనిపిస్తుందని వెల్లడించారు. ఈ సంఖ్య అనేది పరీక్ష నిర్వహించే వ్యక్తి శరీరంలోని యాంటిజెన్ గాఢత, వైరల్ ప్రోటీన్ యొక్క సాంద్రతపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

  ఇది కరోనా నిర్ధారణ పరీక్ష ఖర్చును చాలా వరకు తగ్గిస్తోందని పరిశోధకులు తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం COVID-19ను గుర్తించడమే కాక ఇతర వ్యాధులకు కూడా ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published: