ఏపీలో కొత్త రకం కరోనా వైరస్.. తెలంగాణ హైకోర్టు హెచ్చరించిందన్న చంద్రబాబు

చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫొటో)

Chandrababu Naidu: ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని గుర్తు చేశారు.

 • Share this:
  కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్-440 వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని ఆయన గుర్తు చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. జూమ్ ద్వారా విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు.. ఈ విషయంలో ఆవేదనతోనే మాట్లాడతున్నామని వ్యాఖ్యానించారు. బెడ్లు, వెంటిలేటర్ల కొరత లేదని ఏపీ ప్రభుత్వం చెప్పడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.

  ప్రభుత్వ వైఖరితో బాధ కలిగే పొలిట్‌బ్యూరో సమావేశం పెట్టామని చంద్రబాబు తెలిపారు. తమ ఆఫీసులో కూడా కొందరికి కరోనా వచ్చిందన్న చంద్రబాబు.. వారికి అమెరికా వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించామని వెల్లడించారు.అతి తీవ్రమైన కరోనాకు కేబినెట్ భేటీలో ప్రాధాన్యత లేదని చంద్రబాబు మండిపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని అన్నారు. కరోనా రోగులకు తమ పార్టీ తరపున సాయం అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

  ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలకు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని గుర్తు చేశారు. వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందన్న చంద్రబాబు.. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాదని, ఏకంగా ముఖ్యమంత్రే సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్య ధోరణి వీడాలని సూచించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: