Home /News /coronavirus-latest-news /

NEW CORONA RULES NIGHT CURFEW ENFORCED IN ODISHA TAMIL NADU AP SNR

ఆ రాష్ట్రాల్లో కరోనా న్యూ కండీషన్స్ ..నైట్‌ కర్ఫ్యూ షురూ

 నైట్ కర్ఫ్యూ

నైట్ కర్ఫ్యూ

CORONA FEVER: మళ్లీ కథ మొదటికి వచ్చేలా ఉంది. కరోనా కొత్త వేరియంట్ కేసులు చాలా రాష్ట్రాల్లో వేలు దాటిపోతున్నాయి. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తమిళనాడు, ఒడిషా,ఏపీలో నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కొత్త నిబంధనల్ని జారీ చేశారు. అయినప్పటికి కేసుల సంఖ్య తగ్గపోతే లాక్‌డౌన్‌ తప్పదని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఇది పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలోని డైలాగ్‌ కాదు. వాస్తవంగా భారత్‌లో అదే పరిస్థితి కనిపిస్తోంది. వెంటాడుతున్న వైరస్(Virus)వేరియంట్‌ల (Variants)తో చాలా రాష్ట్రాలు షట్టర్లు క్లోజ్ చేయాల్సిన పరిస్ధితి దాపురించింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కరోనా నిబంధనలు, కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. తాజాగా తమిళనాడు(Tamil Nadu), ఒడిషా(Odisha)అదే దారిలోకి వెళ్తున్నాయి. రోజు రోజుకు అక్కడ పెరుగుతున్న ఒమిక్రాన్(Omicron),కరోనా (Corona)కేసులతో రెండు రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వారం రోజుల క్రితం వరకు అంతా సవ్యంగా సాగిన కార్యకలాపాలు నిదానంగా నిలిచిపోయే పరిస్థితి కలిగింది. ముఖ్యంగా తమిళనాడులో గురువారం ఒక్కరోజే కొత్తగా 6,983 కరోనా, ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ (New variants)కేసులు నమోదవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నైట్‌ కర్ఫ్యూ (Night curfew) అమలు చేస్తోంది. జనవరి(January) 6వ తేది నుంచి రాత్రి 10గంటల మొదల్కొని ఉదయం 5గంటల వరకూ కర్ఫ్యూ అమలవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివ్ కేసుల(Positive cases)సంఖ్య 16వేలకుపైగా ఉండటంతో తక్షణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది స్టాలిన్ ప్రభుత్వం.

అక్కడ అప్పుడే నైట్‌ కర్ఫ్యూ..
ఒడిషాలో కూడా కొత్త వేరియంట్ కలకలం రేపుతున్నాయి. కేసులు గణనీయంగా పెరుగడంతో అప్పుడే థర్డ్‌వేవ్ వచ్చినట్లుగా అక్కడి ప్రభుత్వం, ప్రజలు భావిస్తున్నారు. గడిచిన 24గంటల్లో నమోదైన కేసులతో మరింత భయపడిపోతున్నారు. ఒక్కరోజులో 2703 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు నైట్‌ కర్ఫ్యూ అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఇందులో భాగంగానే శనివారం నుంచి రాత్రి 9గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని భువనేశ్వర్‌, కటక్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌కే ప్రియదర్శి ప్రకటించారు. అంతే కాదు వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు 100మందిని, అంత్యక్రియలకు 50లోపు మందిని మాత్రమే అనుమతిస్తున్నామని తెలియజేశారు. హోటళ్లు, సినిమా హాళ్లు, కిరాణా షాపుల దగ్గర ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యాపారులదేనని సూచించారు.

మళ్లీ బుసలు కొడుతున్న  వైరస్ ..
రానున్న సంక్రాంతి పండుగ రోజుల్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్‌లో కూడా శనివారం నుంచి నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుంది. అటు మహరాష్ట్రలో కూడా లాక్‌డౌన్‌ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేసులు పెరిగితే ఆ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కదిద్దుకుంటున్న సమయంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్, కరోనా మరోసారి విరుచుకుపడటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు మార్గదర్శకాల్ని జారీ చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి నిర్ణయాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవచ్చని సూచించింది. తెలంగాణలో కూడా కేసులు పెరగడంతో శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
Published by:Siva Nanduri
First published:

Tags: Corona third wave, Night curfew

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు