Corona: ఈ మాస్క్ పెట్టుకుంటే.. ఏ వైరస్ అయినా మీ ధరిచేరదట

ప్రపంచమంతా కరోనా తో అల్లాడుతున్నది. పలు దేశాల్లో సెకండ్ వేవ్ కూడా ప్రారంభమైంది. ఇంకా వ్యాక్సిన్ తయారీదశలోనే ఉన్నది. ఇప్పటికైతే మాస్కే మందు అని వైద్యులు చెబుతున్నారు.

news18
Updated: November 13, 2020, 1:19 PM IST
Corona: ఈ మాస్క్ పెట్టుకుంటే.. ఏ వైరస్ అయినా మీ ధరిచేరదట
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 13, 2020, 1:19 PM IST
  • Share this:
కరోనా నుంచి కట్టడి చేయడానికి ఫేస్ మాస్కును మించింది మరోకటి లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు కొత్త ఫేస్ మాస్క్ ను తయారుచేశారు. ఈ మాస్క్ తో కొద్దిసేపు ఎండలో ఉంటే చాలు.. 99.9% బ్యాక్టీరియా నశిస్తుందని చెబుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభనతో ప్రజల జీవితంలో ఫేస్ మాస్క్ భాగమైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ లేనిదే బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వైరస్ బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు మాస్క్ ను వినియోగిస్తున్నారు.

అయితే, మార్కెట్లో అనేక రకాల ఫేస్ మాస్క్ లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని అప్పటికప్పుడు వాడి పడేసేవి కాగా, మరికొన్ని శుభ్రం చేసి మళ్లీ వాడేవి. అయితే, వీటిలో ఎక్కువ మంది పునర్వినియోగ క్లాత్ మాస్కులనే ఉపయోగిస్తున్నారు. మాస్క్ వాడటం మంచిదే అయినప్పటికీ, కొందరు వాటిని శుభ్రం చేయకుండా వాడుతున్నారు. దీంతో వారికి వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిని ఇదివరకే అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పునర్వినియోగ క్లాత్ ఫేస్ మాస్క్‌ను అభివృద్ధి చేశారు అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.

వీరు అభివృద్ధి చేసిన క్లాత్ ఫేస్ మాస్క్ లను ఇతర మాస్కుల్లా పదే పదే శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. వీటిని శుభ్రం చేయకుండానే పగటిపూట కేవలం 60 నిమిషాల పాటు ఎండలో ఉంటే చాలు దానిపై ఉండే 99.99 శాతం బ్యాక్టీరియా, వైరస్లు చనిపోతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా, దీనిలో ఉపయోగించిన క్లాత్కు నానోస్కేల్ ఏరోసోల్ కణాలను ఫిల్టర్ చేసే శక్తి ఉంటుంది. ఇవి -దగ్గు లేదా తుమ్ము ద్వారా వ్యాపించే- COVID-–19 వంటి వ్యాధుల వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయి.

కాగా, దీన్ని పగటిపూట ఎండలో ఆరబెట్టినప్పుడు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ (ROS)ను విడుదల చేస్తాయి. ఈ క్లాత్ మాస్క్ ను ఉతికి లేదా కడిగినప్పుడు దాని ఉపరితలంపై ఉన్న సూక్ష్మజీవులు నశిస్తాయి. తద్వారా వాటిని పునర్వినియోగించినా సరే ఎటువంటి వ్యాధులు ధరి చేరకుండా సురక్షితంగా ఉంటారు. కాగా, కాలిఫోర్నియా యూనివర్సిటీ రూపొందించిన ఈ నూతన క్లాత్ మాస్క్ గురించి ACS అప్లైడ్ మెటీరియల్స్ & ఇంటర్ఫేస్ జర్నల్ తాజాగా తన అధ్యయనంలో ప్రచురించింది.

సూర్యకాంతితో 99 శాతం బ్యాక్టీరియా నశిస్తుంది..

భోజన విరామ సమయంలో ఎండలో లేదా ఆఫీసు బిల్డింగ్ లైట్ల క్రింద కొద్ది సమయం గడపడం వాటి నుంచి బహిర్గతమయ్యే సూర్యకాంతితో క్లాత్ మాస్క్ పై ఉన్న క్రిములను నాశనం చేయవచ్చు. కాగా, 2- డైథైలామినో ఇథైల్ క్లోరైడ్ (DEAE-Cl )ను క్లాత్ కు అటాచ్ చేయడం ద్వారా ఈ యాంటీ మైక్రోబయల్ ఫేస్ మాస్క్ ను తయారు చేశారు. ఈ మాస్క్ పెట్టుకొని పగటిపూట ఎండలో 60 నిమిషాలు ఉంటే చాలు 99.99 శాతం బ్యాక్టీరియా నశిస్తుంది.

దీంతో ఈ క్లాత్ మాస్క్ 99.99 శాతం బ్యాక్టీరియాను లేకుండా చేస్తుంది. అయితే, ఈ పునర్వినియోగ క్లాత్ మాస్క్ లలో యాంటీమైక్రోబయాల్ యాక్టివిటీ కోల్పోకుండా ఉండాలంటే వారంలో కనీసం 10 సార్లు శుభ్రం చేయడం మంచిదని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ క్లాత్ ఫేస్ మాస్క్ లో వాడే ఫాబ్రిక్ పునర్వినియోగించడానికి సహకరిస్తుంది. ఈ యాంటీ బాక్టీరియల్/ యాంటీవైరల్ క్లాత్ ఫేస్ మాస్క్‌లు మానవ శరీరానికి ప్రొటెక్టివ్ సూట్‌లుగా పని చేస్తాయి.
Published by: Srinivas Munigala
First published: November 13, 2020, 1:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading