NEW ALGORITHM CAN PREDICT COVID COMPLICATION RISK DETAILS HERE GH VB
Corona-Omicron: కరోనా సోకిన మనిషికి.. అది ఏ స్థితిలో ఉందో గుర్తించే సరికొత్త ప్రయోగం.. పూర్తి వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం (istock)
కరోనా(Corona) మహమ్మారి మరోసారి కోరలు చాచి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో రోజుకు లక్షకు పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క అగ్నికి వాయువు తోడైనట్లు ఓమిక్రాన్(Omicron) కూడా ప్రజలను భయానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో(Hospital) చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
కరోనా(Corona) మహమ్మారి మరోసారి కోరలు చాచి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో రోజుకు లక్షకు పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క అగ్నికి వాయువు తోడైనట్లు ఓమిక్రాన్(Omicron) కూడా ప్రజలను భయానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో(Hospital) చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో డచ్ పరిశోధకులు(Dutch Researchers) సరికొత్త అల్గారిథమ్‌ను అభివృద్ధి (Development) చేశారు. కరోనా(Corona) కారణంగా ఆసుపత్రిలో చేరడం ద్వారా మరణంతో సహా తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని కచ్చితంగా ఈ అల్గారిథమ్ (Algorithm) అంచనా వేస్తుందని తెలిపారు. వైద్యులకు చెందిన ఎలక్ట్రానిక్ (Electronic) రికార్డుల్లోని డేటా ఆధారంగా అత్యధిక రిస్క్(Risk) ఉండే వ్యక్తులను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆమ్‌స్టర్‌డాంలోని వీయు యునివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు చెప్పారు. నెదర్లాండ్స్‌లో(Nedarlands) కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో తీవ్ర సమస్యలను బాగా అంచనా వేసిందని స్పష్టం చేశారు.
70 శాతం రోగులతో కూడిన ట్రైనింగ్ డేటా సెట్(Training Data Set) నుంచి ఈ అల్గారిథమ్ అభివృద్ధి చేశారు. మిగిలిన 30 శాతం కూడా వాలిడేట్ చేశామని అన్నారు. కోవిడ్-19 సమస్యలతో పాటు స్థూలకాయం, వయస్సు(Age), లింగ ఆధారంగా వచ్చే సమస్యలను ఈ అల్గారిథమ్ అంచనా వేస్తుంది. కరోనా మొదటి, రెండో వేవ్ ప్రమాద కారకాల ఆధారంగా వీటిని తెలుపుతుంది.
2020 ఏప్రిల్ 10 నుంచి 2021 జనవరి 21 మధ్య కాలంలో వచ్చిన కోవిడ్ కేసుల డేటా ఆధారంగా దీన్ని రూపొందించారు. మొత్తం 264 జనరల్ ప్రాక్టీషనర్ల నుంచి 6074 రిపోర్టులను పరిశీలించారు. వీటిలో 291 మందికి తీవ్ర సమస్యలు రాగా.. 181 మంది ఆసుపత్రిపాలయ్యారు. 59 మంది నర్సింగ్ హోంలో చికిత్స పొందగా..51 మంది చనిపోయారు. వైద్య రికార్డుల ఆధారంగా తీవ్రమైన సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి అల్గారిథమ్ ఉపయోగపడుతుంది. ఇది టీకా కోసం వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో సహాయపడుతుంది. ఈ రిగ్రెషన్ అంచనాల ఆధారంగా భవిష్యత్తు పరిస్థితులను సర్దుబాటు చేయాలని పరిశోధకులు హెచ్చరించారు.
ప్రస్తుతం దేశంలో గత 24 గంటల వ్యవధిలో 13.52 లక్షల పరీక్షలు నిర్వహించగా.. 1,79,723 కేసులు నమోదు అయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే పాజిటివిటీ రేటు కూడా 13.29 శాతం పెరిగింది. ఇదే సమయంలో 46,569 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఆదివారం ఉదయం నాటికి దేశంలో మొత్తం 5.90 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 7.23 లక్షలకు చేరింది. యాక్టివ్ కేసుల రేటు 2.03 శాతానికి పెరిగింది. మరోవైపు ఒక్క రోజులో 146 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.