Network18 Poll: అమ్మో... సినిమాలు, టూర్లకు వెళ్లం: నెట్వర్క్18 పోల్‌లో ప్రజాభిప్రాయం ఇదే

#Network18PublicSentiMeter | కోవిడ్ 19 సంక్షోభం తర్వాత జీవితం ఎలా మారిపోబోతోంది? ప్రజల లైఫ్‌స్టైల్ ఎలా ఉండబోతోంది. దీనిపై నెట్వర్క్18 నిర్వహించిన పోల్‌లో ప్రజాభిప్రాయమిదే.

news18-telugu
Updated: May 29, 2020, 6:34 PM IST
Network18 Poll: అమ్మో... సినిమాలు, టూర్లకు వెళ్లం: నెట్వర్క్18 పోల్‌లో ప్రజాభిప్రాయం ఇదే
దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తున్న తరుణంలో... కొన్ని నగరాల్లో మాత్రం ఆ వైరస్ ప్రభావం తగ్గుతోందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు.
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి ప్రజల లైఫ్‌స్టైల్‌ను మార్చేసింది. కొన్ని అలవాట్లను మార్చేంది. కొత్త అలవాట్లను ఫాలో అయ్యేలా చేసింది. కరోనా వైరస్ కన్నా ముందు చేసిన పనుల్లో ఇకపై చాలావరకు భవిష్యత్తులో చేయమని అంటున్నారు ప్రజలు. అసలు కరోనా వైరస్ సంక్షోభం ప్రజల్లో ఎలాంటి భయాలను సృష్టించింది? ఎలాంటి కొత్త అలవాట్లు చేసుకోబోతున్నారు? ఈ సంక్షోభం తర్వాత ప్రజల జీవితం ఎలా ఉండబోతోంది అన్న అంశాలతో నెట్వర్క్18 గ్రూప్ ఓ పోల్ నిర్వహించింది. 10 ప్రశ్నలు వేసింది. ఈ పోల్‌లో ఆశ్చర్యకరమైన సమాధానాలు చెప్పారు ప్రజలు. ఇకపై సినిమాలు, టూర్లకు వెళ్లేది లేదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ప్రజారవాణాను సైతం ఉపయోగించమని, సొంతవాహనాల్లో వెళ్తామన్నారు. ఆ 10 ప్రశ్నలకు తెలుగు ప్రజలు ఏఏ సమాధానాలు వచ్చాయో తెలుసుకుందాం.

1. మీరు మళ్లీ విమానం లేదా రైలులో ఎప్పుడు ప్రయాణిస్తారన్న ప్రశ్నకు 45% మంది ఈ సంవత్సరం ప్రయాణాలను వాయిదా వేసుకుంటామని చెప్పారు. 23% మంది కనీసం 3 నెలలు వేచి చూస్తామన్నారు. కనీసం ఒక నెల వేచి చూస్తామని 16% మంది చెప్పగా విమానాలు / రైళ్ల సేవలు ప్రారంభమైన వెంటనే ప్రయాణిస్తామని 16% మంది చెప్పారు.

2. ఈ సంవత్సరం మీరు సినిమా థియేటర్‌కు వెళ్లగలరని అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు దాని గురించి మర్చిపోండి, ఇక మళ్లీ అక్కడికి వెళ్లేది లేదని 48% మంది చెప్పడం విశేషం. ఈ ఏడాది థియేటర్‌కు వెళ్లబోమని 34% మంది చెబితే 18% మంది వెళ్తామన్నారు.

3. దీర్ఘకాలంలో మీరు బయట భోజనం చేయటం, ఆర్డర్ చేయటం తగ్గించుకుంటారా అని అడిగితే స్వయంగా వంట చేసుకుంటామని 75% మందిచెప్పారు. 'నో కాంటాక్ట్' డెలివరీ ఆప్షన్ ఉంటే ఆర్డర్ చేస్తామని 16% మంది చెప్పారు. బయట అస్సలు భోజనం చేయమని 9% మంది వెల్లడించారు.

4. మీరు అపరిచితులతో మళ్లీ షేక్ హ్యాండ్ చేస్తారా అని అడిగితే అస్సలు చేయమని 81% మంది చెప్పారు. తెలియదు / చెప్పలేను అని 17% మంది చెప్పగా, తప్పకుండా చేస్తామని 3% మంది చెప్పారు.

5. మీకు ఇష్టమైన కోవిడ్ 19 వారియర్ ఎవరు అని అడిగితే 75% మంది వైద్యులు / నర్సులు / ఆరోగ్య కార్యకర్తలని చెప్పగా, శానిటరీ వర్కర్స్ అని 11%, పోలీసులు అని 9%, ఇతరులు అని 5% చెప్పారు.

6. భవిష్యత్తులో మీరు తక్కువగా హాలిడే ట్రిప్స్‌కి వెళ్తారా అని అడిగితే 61% అవునని, 18% కాదని, 21% తెలియదు / చెప్పలేను అని సమాధానమిచ్చారు.

7. మీరు పార్టీ ఇవ్వడం లేదా వెళ్లడం మళ్లీ ఎప్పుడు కుదురుతుందని అనుకుంటున్నారు అని అడిగితే ఈ ఏడాది మొత్తం కుదరదు 63% మంది తేల్చి చెప్పేశారు. మరో మూడు నెలలకు నేను సిద్ధంగా ఉంటానని 24% మంది చెప్పగా, కనీసం ఒక నెల ఆగుతామని 7% మంది చెప్పారు. కొద్దిమందితో ఇప్పటికే పార్టీలు చేసుకుంటున్నామని 6% మంది చెప్పారు.

8. ఈ మహమ్మారి మిమ్మల్ని దయగల వ్యక్తిగా మార్చిందా అని అడిగితే తాము ఇప్పటికే దయతో ఉన్నట్టు 54% మంది చెప్పారు. అవునని అనుకుంటున్నాను అని 32%, తెలియదు / చెప్పలేను అని 14% సమాధానం ఇచ్చారు.

9. మహమ్మారి ముగిసిన తర్వాత కూడా మీరు ఇంటి పనిలో ఎక్కువ సహాయం చేస్తారా? అని అడిగితే అవును అని 82%, కాదు అని 6%, తెలియదు / చెప్పలేను- 12% మంది వెల్లడించారు.

10. లాక్‌డౌన్ సడలించిన తర్వాత, ప్రజారవాణాకు అనుమతించిన తర్వాత, మీరు తరచూ బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తారా లేదా సొంత వాహనాలను ఉపయోగిస్తారా అని అడిగితే సొంత వాహనాన్ని ఉపయోగిస్తామని 70% మంది చెప్పారు. ప్రజా రవాణా ఉపయోగిస్తామని 17% మంది, తెలియదు / చెప్పలేను అని 10%, ఊబెర్ సేవలు ప్రారంభమయ్యే వరకు వేచిచూస్తాను అని 3% మంది చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Coronavirus: ఆయుర్వేదంతో ఇమ్యూనిటీ పెంచుకోండి ఇలా... ఆయుష్ మంత్రిత్వ శాఖ టిప్స్

COVID-19: మీ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మెడికల్ గ్యాడ్జెట్స్ ఇవే

Work From Home: ఈ గ్యాడ్జెట్స్, యాప్స్ ఉంటే మీ ఇల్లే ఆఫీస్‌గా మారిపోతుంది
Published by: Santhosh Kumar S
First published: May 29, 2020, 5:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading