KotamReddy Sridhar Reddy: ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా

KotamReddy Sridhar Reddy: శ్రీధర్ రెడ్డితో గత వారం రోజుల నుంచి కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని... ఆయన సన్నిహితులు హోం ఐసొలేషన్‌లో ఉండాలని అధికారులు కోరారు.

news18-telugu
Updated: September 13, 2020, 4:08 PM IST
KotamReddy Sridhar Reddy: ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతి రోజూ రికార్డ్ స్థాయిలో కోవిడ్ 19 కేసులు నమోదవుతున్నాయి. సామాన్యూలతో పాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యే కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.

Kotamreddy Sridhar reddy corona virus, Kotamreddy Sridhar reddy covid 19, Kotamreddy Sridhar reddy news, Kotamreddy Sridhar reddy Nellore, ap news, ap corona cases, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కరోనా పాజిటివ్, నెల్లూరు న్యూస్, ఏపీ న్యూస్
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి


నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కువగా జనంలోనే ఉంటారు. నియోజకవర్గంలోని కార్యకర్తలను తరుచూ కలుస్తుంటారు. దీంతో శ్రీధర్ రెడ్డితో గత వారం రోజుల నుంచి కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని... ఆయన సన్నిహితులు హోం ఐసొలేషన్‌లో ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9901 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 557587కి పెరిగింది. అలాగే, 24 గంటల వ్యవధిలో 67 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4846కి చేరింది.
Published by: Kishore Akkaladevi
First published: September 13, 2020, 3:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading