ఆనందయ్య ఎక్కడున్నారు.. ప్రస్తుతం ఎలా ఉన్నారు..? ఆయన ఆరోగ్యం బాగనే ఉందా..? ఎప్పుడు మందులు తయారు చేస్తూ బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు..? ఆయనను ఎవరికీ ఎందుకు చూపించడం లేదు. ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి అంటున్నారు. నెల్లూరు జిల్లాల్లోని కృష్ణపట్నం ప్రజలు.. దేశ వ్యాప్తంగా కరోనా భయపెడుతున్న వేళ.. అందరి చూపు నెల్లూరు కృష్ణపట్నం వైపే పడింది. ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాపై పనిచేస్తుందా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాకపోయినా.. జనం మాత్రం ఆ ముందును బాగా నమ్ముతున్నారు. వేల సంఖ్యలో జనం ఆ మందు కోసం ఎగబడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. దేశ వ్యాప్తంగా అందరూ ఈ మందు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఆనందయ్యకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు మందు వాడుతున్నవారు అంతా తమకు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పడం.. కరోనా నుంచి కోలుకున్నామని కొందరు చెబుతుండడంతో డిమాండ్ పెరిగింది. అంతేకాదు ఆయన ఔషదంతో ఎలాంటి హామీ లేదని ఆయూష్ అధికారులు నిర్ధారించడంతో.. ఆనందయ్యపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆయన హాట్ టాపిక్ గా మారారు.
ఇదీ చదవండి: ఆనందయ్య మందుపై టాలీవుడ్ అభిప్రాయం ఇదే... బాలయ్య కీలక వ్యాఖ్యలు
ఆనందయ్య మందుకు ఫుల్ డిమాండ్ ఉన్నా.. ఆయన మాత్రం ఉచితంగానే వేస్తానని ప్రకటించారు. కానీ ఆయన మందుకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో కొందరు దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఆయన పేరుతో బ్లాక్ మార్కెట్లో మందును భారీ ధరకు అమ్ముకుంటున్నారు. ఇప్పటికే కొంతమందిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. మరోవైపు ఆనందయ్య పై తీవ్ర ఒత్తిడి ఉందని.. ఆయనతో కొందరు ప్రైవేటుగా మందు తయారు చేయించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక అధికార పార్టీ నేతలు.. ఆనందయ్యను బంధించి వారికి కావాల్సిన వారికి మందులు తయారు చేయించుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఇదీ చదవండి: ఎంపీ రఘురామకు ఏమైంది... కాలు కింద పెట్టకూడదంటుున్న ఎయిమ్స్ వైద్యులు
విపక్ష నేతల విమర్శలు ఎలా ఉన్నా.. ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. తనపై తీవ్ర ఒత్తిడి ఉందని.. 30 ఏళ్లుగా తాను మందు పంపిణీ చేస్తున్నానని.. కానీ ఇప్పుడు ఫార్ములా ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని.. అందుకే ప్రభుత్వం ఒత్తిడి లేకుండా చూడాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో స్థానిక ప్రజలు కూడా ఆందోళన బాట పట్టారు.
ఇదీ చదవండి: అదృష్టం అంటే ఇదే.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడైన రైతు..? అదెలా సాధ్యం
ఇప్పటికే భారీ సంఖ్యలో కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు.. ఆయన్ను అక్కడ బంధించి ఉంటరాని వారు అనుమానిస్తున్నారు. గత వారం రోజులుగా ఆనందయ్య ఆచూకీ కనపడనీయకుండా చేస్తున్నారని.. ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించి.. ఉచితంగా మందులు తాయరు చేస్తున్న ఆయన్ను ఎందుకు బంధించారని ప్రశ్నిస్తున్నారు. కృష్ణపట్నం పరిశరాల్లో చాలా చోట్ల కరోనా కేసులు లేవని.. దానికి కారణం ఆయన ఇస్తున్న మందే అంటున్నారు.. ఆనందయ్యను ఎందుకు ప్రజల ముందుకు తీసుకురావడం లేదని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆనందయ్యను చూపించినంత వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజలు దాటిన ఆయన మందుపై ఎందుకు నివేదిక ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anandaiah corona medicine, Andhra, Andhra Pradesh, AP News, CORONA MEDICINE, Nellore