ఒక్క రోజులోనే లక్ష కరోనా కేసులు.. అమెరికా, యూకే, రష్యా అతలాకుతలం..

కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ప్రమాదకర స్థాయిని కూడా మించేలా తయారైందీ వైరస్. కేవలం 24 గంటల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: May 15, 2020, 6:33 AM IST
ఒక్క రోజులోనే లక్ష కరోనా కేసులు.. అమెరికా, యూకే, రష్యా అతలాకుతలం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ప్రమాదకర స్థాయిని కూడా మించేలా తయారైందీ వైరస్. కేవలం 24 గంటల్లోనే దాదాపు లక్ష కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. అలాగే మృతుల సంఖ్య 3 లక్షలు దాటింది. అమెరికా, యూకే, బ్రెజిల్ దేశాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఆ దేశాల్లో వైరస్ వ్యా్ప్తి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అమెరికాలో రోజుకు 20వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే ఆ దేశంలో 26,398 కొత్త కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో నిన్న 13,761 కేసులు, రష్యాలో 9,974 కేసులు నమోదయ్యాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో వందల్లో కేసులు నమోదవుతుండగా.. భారత్‌లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇండియాలో గత 24 గంటల్లో 3942 కేసులు నమోదయ్యాయి.

అటు.. మరణాల్లోనూ అమెరికా టాప్ ప్లేస్‌లో నిలిచింది. అక్కడ నిన్న 1,703 మంది చనిపోగా, స్పెయిన్2లో 217, యూకేలో 428, ఇటలీలో 262, బ్రెజిల్‌లో 835, ఫ్రాన్స్‌లో 351, మెక్సికోలో 294, కెనడాలో 170 మంది కరోనా సోకి మరణించారు. మొత్తం మరణాల్లో అమెరికానే టాప్‌(86,900)లో ఉంది.

కరోనా కేసుల గణాంకాలు :
మొత్తం కేసులు 45,21,174
మరణాలు 3,03,070
కోలుకున్నవారు 17,02,113
యాక్టివ్ కేసులు 25,15,991

క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నవారు 45,566
Published by: Shravan Kumar Bommakanti
First published: May 15, 2020, 6:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading