Home /News /coronavirus-latest-news /

NEARLY 150 ARMY MEN WHO CAME TO PARADE IN REPUBLIC DAY EVENT TESTED COVID 19 POSITIVE AK

Republic Day 2021: 150 మంది సైనికులకు కరోనా.. సాదాసీదాగా రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే పరేడ్ (ప్రతీకాత్మక చిత్రం )

రిపబ్లిక్ డే పరేడ్ (ప్రతీకాత్మక చిత్రం )

రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన 150 మంది సైనికులు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలు సైతం ధృవీకరించాయి.

    కరోనా కారణంగా ఈ ఏడాది పంద్రాగస్ట్ వేడుకలు సాదాసీదాగా జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మొదలుకుని అనేక రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఇక వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఇదే రకంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటికల్లా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే.. ఈ వేడుకలను ఎప్పటిలాగే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే వ్యాక్సిన్ పంపిణీ మొదలైనా.. జనవరి 26 నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం లేకపోవడంతో ఈసారి భారత గణతంత్ర దినోత్సవం వేడుకలను సాదాసీదాగా పూర్తిచేయనున్నారు.

    ఇప్పటికే పరేడ్‌లో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన 150 మంది సైనికులు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలు సైతం ధృవీకరించాయి. గత కొన్నిరోజులుగా సెకండ్‌ వేవ్‌తో ఢిల్లీ అతలాకుతలం అవుతుండటంతో.. రిపబ్లిక్‌ డే ఉత్సవాలను కూడా సాదాసీదాగానే నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ వేడుకల్లో వివిధ కవాతుల్లో పాల్గొనడానికి వచ్చిన సైనికులను సేఫ్‌ బబుల్‌లో వేయడానికి ముందు పరీక్షించారు. వీరిలో కొందరికి పాజిటివ్‌గా తేలింది. అయితే కొవిడ్‌-19కు సంబంధించిన అన్ని లక్షణాలు లేనప్పటికీ వారిని ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉంచాలని సైనికాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

    పరేడ్‌కు హాజరవుతున్న పెద్ద సంఖ్యలోని సైనికుల్లో 150 మందికి కరోనా పాజిటివ్‌ రావడం పట్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు. రిపబ్లిక్‌ డే కవాతును సురక్షితంగా నిర్వహించడానికి ప్రోటోకాల్స్ ఉంచినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. గణతంత్ర దినోత్సవంతో పాటు ఆర్మీ డే పరేడ్‌లో పాల్గొనడానికి ప్రతి ఏటా వేలాది మంది సైనికులు దేశ రాజధానికి వస్తుంటారు. కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 26న రాజ్‌పథ్‌లో కవాతు నిర్వహించడానికి ప్రణాళికలు కొనసాగుతున్నాయి. యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ను ముఖ్యఅతిథిగా భారత్ ఆహ్వానించింది. అయితే బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ కారణంగా ఆయన భారత్ పర్యటనకు వస్తారో రారో అనే సందేహాలు నెలకొన్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Republic Day 2021

    తదుపరి వార్తలు