Home /News /coronavirus-latest-news /

NCP CHIEF SHARAD PAWAR TESTS POSITIVE FOR COVID SAYS NO NEED TO WORRY MKS

Sharad Pawar: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్.. ఫోన్ చేసి ఆరా తీసిన PM Modi

శరద్ పవార్ (పాత ఫొటో)

శరద్ పవార్ (పాత ఫొటో)

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ వేదికగా వెల్లడించారు. పవార్ వయసు 81 ఏళ్లు కావడంతో..

దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా మహారాష్ట్ర అంతటా కరోనా వైరస్ ఉధృతి కొద్దిగా నిదానించింది. చాన్నాళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాగా, మహారాష్ట్ర కేంద్రంగా పనిచేసే జాతీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్ వేదికగా వెల్లడించారు. పవార్ వయసు 81 ఏళ్లు కావడంతో ఆయన కరోనా బారిన పడ్డారన్న వార్త ఎన్సీపీ శ్రేణుల్ని, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని కలవరపెట్టింది.

తాను కరోనాకు గురైనట్టు స్వయంగా వెల్లడించిన శరద్ పవార్.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ సైతం తన ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు తెలిపారు. ‘ప్రధాని మోదీ ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆయన చూపిన శ్రద్ధకు నేను కృతజ్ఞుడిని’అని పవార్ తెలిపారు. అలాగే ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు పరీక్ష చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.




Rajasthan: అందమైన కోడల్ని కోరి తెచ్చుకుంది.. కానీ అనూహ్య ఘటన తర్వాత ఆ అత్త తీసుకున్న నిర్ణయమిది..



ముంబై సహా మహారాష్ట్ర అంతటా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం నాడు కొత్తగా 26,538 కేసులు, 8 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి ఉధృతి తగ్గిన దరిమిలా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. 1 నుంచి 12 తరగతి వరకు విద్యార్థులకు ఫిజికల్ క్లాసులు నిరాటంకంగా సాగుతున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం కఠిన ఆంక్షలు జారీ చేసింది. అతి త్వరలోనే కాలేజీలు, ఇతర ఉన్నత స్థాయి విద్యా సంస్థల రీఓపెనింగ్ పైనా ఉద్ధవ్ సర్కారు నిర్ణయం తీసుకోనుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Coronavirus, Covid, NCP, Sharad Pawar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు