గల్వాన్ అమరజవాన్లు, ఫ్రంట్‌లైన్ కరోనా యోధులను దేశం మరువదు..

దేశ 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగం

President Ramnath Kovind Independence Day Speech | భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లద్ధఖ్‌లో దేశం కోసం ప్రాణాలర్పించిన 20 మంది అమరజవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు.

 • Share this:
  President Ramnath Kovind Independence Day Speech: భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లద్ధఖ్‌లో దేశం కోసం ప్రాణాలర్పించిన 20 మంది అమరజవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. శనివారం దేశ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని...ఈ సాయంత్రం జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. యావత్ జాతి తరఫున గల్వాన్ లోయలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. జూన్ మాసంలో గల్వాల్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు వీరమరణం చెందడం తెలిసిందే.

  ఫ్రంట్‌లైన్ కరోనా వారియన్స్‌కు కితాబు...
  కరోనా వైరస్‌పై పోరాటంలో ముందు వరుసలో నిలుస్తున్న ‘ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్’ సేవలు అమోఘమంటూ డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది సేవలను రాష్ట్రపతి కోవింద్ కొనియాడారు. వీరి సేవలను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో దేశం చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తగిన సమయంలో తీసుకున్న చర్యలతో సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నట్లు పేర్కొన్నారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టాన్ని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతం అయ్యిందని కొనియాడారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయని కితాబిచ్చారు.



  కరోనా కట్టడిలో దేశ ప్రజల సహకారం గ్రేట్..
  కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో దేశ ప్రజల సహకారం అమోఘమని కొనియాడారు. కరోనా కారణంగా ఈ ఏడాది మునుపటిలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మునుపటిలాజరుపుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు.

  ప్రధాని మోదీకి రాష్ట్రపతి అభినందనలు...
  కరోనా సంక్షోభం నేపథ్యంలో పలు రంగాల్లో దేశం స్వయం సంవృద్ధి సాధించేలా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతి అభినందించారు.

  రాష్ట్రపతి ప్రసంగంలో అయోధ్య రామాలయం...
  రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన ప్రసంగంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశాన్ని కూడా ప్రస్తావించారు. 10 రోజుల క్రితం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిందని, దీని పట్ల యావత్ దేశం గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.



  దేశంలో కొత్తగా తీసుకొస్తున్న జాతీయ విద్యా విధానం పట్ల రాష్ట్రపతి కోవింద్ అభినందనలు తెలిపారు.
  Published by:Janardhan V
  First published: