Home /News /coronavirus-latest-news /

గుంటూరు జిల్లాలో షాపింగ్ కాంప్లెక్స్, ఇళ్లకు అద్దెమాఫీ చేసిన ఓనర్..

గుంటూరు జిల్లాలో షాపింగ్ కాంప్లెక్స్, ఇళ్లకు అద్దెమాఫీ చేసిన ఓనర్..

బొలిశెట్టి వెంకటేష్

బొలిశెట్టి వెంకటేష్

తన షాపింగ్ కాంప్లెక్స్‌లోని దుకాణాలు, ఇళ్ళల్లో అద్దెకు ఉండే వారికి రెండు నెలల అద్దెను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు బొలిశెట్టి కన్ స్ట్రక్షన్స్ అధినేత బొలిశెట్టి వెంకటేష్ ప్రకటించారు.

    (రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్ 18)

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రళయంగా మారి బతుకు జీవుడా అంటూ అన్ని వర్గాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. చిన్న, మధ్యతరగతి వ్యాపారుల పరిస్థితి సరిగా లేదు. వ్యాపారాలు లేక, అద్దెలు చెల్లించలేక, గుమాస్తాల జీతాలు చెల్లించలేక కరెంట్ బిల్లులు, టాక్స్‌లు కట్టలేక అవస్థలు పడుతున్న తరుణంలో తన వంతు బాధ్యతగా తనకు చెందిన కిరాయిదారులకు ఎంతో కొంత ఊరట కలిగించాలనే సంకల్పంతో తన షాపింగ్ కాంప్లెక్స్‌లోని దుకాణాలు, ఇళ్ళల్లో అద్దెకు ఉండే వారికి రెండు నెలల అద్దెను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు బొలిశెట్టి కన్ స్ట్రక్షన్స్ అధినేత బొలిశెట్టి వెంకటేష్ ప్రకటించారు. వెంకటేష్ కి సొంతమైన వాణిజ్య సముదాయంలోని షాపులు, రెండు ఇళ్ళు అద్దెలకు ఇచ్చాడు. అయితే వాటి వల్ల తనకి వచ్చే అద్దెను తన సహృదయంతో లాక్ డౌన్ సమయంలో అద్దె చెల్లించవలసిన అవసరం లేదని తన మానవత్వాన్ని చాటుకున్నాడు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో సాటి వారికి సహాయ పడితే ఆ సహాయం ఎక్కడో మనకి దేవుడు సహకరిస్తాడని మనఃస్ఫూర్తిగా నమ్ముతూ మిగతా షాపులు యజమానులు కూడా తమకు తోచిన విధంగా సహకరించమని సూచన చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఎంతోమంది తన వద్దకు వచ్చి పరిస్థితులు చెప్పుకొని బాధపడుతుదటంతో చలించిపోయానని వెంకటేష్ చెప్పారు. మిగతా షాపులు యజమానులు కూడా మీకు అవకాశం ఉంటే మీకు తోచిన విధంగా అద్దెను మాఫీ చేయాలని బొలిశెట్టి వెంకటేష్ పిలుపునిచ్చారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Guntur, Narasaraopet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు