కరోనా పై పోరులో నారా రోహిత్ తన వంతు విరాళం.. ఎంతంటే..

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచాన్ని చాపలా చుట్టేసిన కరోనా వైరస్ పై ప్రపంచ ప్రజలు కలిసి కట్టుగా పోరాడుతున్నారు. ఈ పోరులో తన వంతు సాయంగా నారా రోహిత్ విరాళం ప్రకటించాడు.

news18-telugu
Updated: March 30, 2020, 7:13 PM IST
కరోనా పై పోరులో నారా రోహిత్ తన వంతు విరాళం.. ఎంతంటే..
నారా రోహిత్: తెలుగు ఇండస్ట్రీలో ఈ తరం హీరోల్లో ఓ దశలో ఏ హీరో చేయనన్ని ప్రయోగాలు చేసాడు రోహిత్. అందుకే ఆయన కెరీర్‌లో బాణం, అసుర, రౌడీా ఫెల్లో సహా ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి.
  • Share this:
ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచాన్ని చాపలా చుట్టేసిన కరోనా వైరస్ పై ప్రపంచ ప్రజలు కలిసి కట్టుగా పోరాడుతున్నారు. మన దేశం కూడా కరోనా కట్టడిలో భాగంగా 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది పేద ప్రజలు ఆకలిలో అల్లాడిపోతున్నారు. వారిని ఆదుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సాయం చేస్తున్నాయి. వీరికి తోడ్పాటుగా సినీ నటులు కూడా మేము సైతం అంటూ విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా కరోనాపై పోరులో భాగంగా ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్.. తన వంతు సాయంగా రూ. 10 లక్షల వంతున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి చెరో రూ.10 లక్షల వంతున మొత్తంగా రూ.30 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఈ రకంగా కరోనాపై పోరులో తన వంతు సాయం అందించడానికి ముందుకు వచ్చాడు నారా రోహిత్. అంతేకాదు కరోనా వైరస్ అంతానికి ప్రజలందరు ఇంట్లో ఉండాలని పిలుపునిచ్చారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 30, 2020, 7:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading