హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కేంద్రం రంగంలోకి దిగాలి... నారా లోకేశ్ డిమాండ్

కేంద్రం రంగంలోకి దిగాలి... నారా లోకేశ్ డిమాండ్

ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని తెలిపారు.

Nara Lokesh: కరోనాపై నిజాలు దాచిన జగన్‌ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

    కేంద్రం ఆధ్వర్యంలో ఏపీలో కరోనా నివారణ చర్యలు చేపట్టాలని టీడీపీ నేత, మాజీమంత్రి నారా లోకేశ్ కోరారు. ఏపీలో కరోనా లేదంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ప్రయత్నం చేశారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే విస్తుపోయే నిజాలను హెల్త్‌ బులెటిన్‌ రూపంలో బయట పడిందని లోకేశ్ అన్నారు. కరోనాపై నిజాలు దాచిన జగన్‌ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ అభ్యర్థులపై వైసీపీ ప్రభుత్వం, స్థానిక నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు.

    గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఒత్తిడితో శావల్యాపురం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర టీడీపీ అభ్యర్థులపై కూడా ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని ఆరోపించారు. టీడీపీలో పోటీలో ఉంటే తమ గెలుపు కష్టమవుతుందనే భయం వైసీపీలో ఉందని... వైసీపీలో చేవ చచ్చిందని తేలిపోయిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తీరు మారకపోతే... వారికి తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Coronavirus, Nara Lokesh

    ఉత్తమ కథలు