Home /News /coronavirus-latest-news /

NARA LOKESH ANGRY OVER FAKE NEWS ON CHANDRABABU VIZAG TOUR SK

మీ బతుకులు మారవ్... వారిపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం

నారా లోకేష్

నారా లోకేష్

అధినేత 420 అయితే.. ఆయన పార్టీ కార్యకర్తలు అంతకుమించి ఉన్నారని వైసీపీపై సెటైర్లు వేశారు లోకేష్. మీ ఫేక్ బతుకులు మారవ్.. అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

    విశాఖలో స్టైరీన్ గ్యాస్ లీకై 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఐతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటిస్తారని, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రత్యేక విమానం కోసం కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారని వార్తలొచ్చాయి. ఐతే ఆయన మాత్రం వైజాగ్‌లో వెళ్లలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు విశాఖ పర్యటనకు సంబంధించి పుకార్లు షికారు చేస్తున్నాయి. కరోనా వ్యాధి తగ్గే వరకు చంద్రబాబు నాయుడు ఇంట్లోనే ఉంటారని.. లోకేష్ కొందరికి వాట్సప్ మెసేజ్ చేసినట్లగా ఫొటోలు వైరల్‌గా మారాయి. చంద్రబాబు ఏపీకి వెళ్తే మళ్లీ తెలంగాణకు వచ్చేందుకు సీఎం కేసీఆర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని.. కానీ ఆయన కేసీఆర్‌ని అడగలేరని అందులో ఉంది. ఈ ఫొటోలపై నారా లోకేష్ ట్విటర్ వేదికగా స్పందించారు.

    అధినేత 420 అయితే.. ఆయన పార్టీ కార్యకర్తలు అంతకుమించి ఉన్నారని వైసీపీపై సెటైర్లు వేశారు లోకేష్. మీ ఫేక్ బతుకులు మారవ్.. అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేరుగా యుద్ధం చేసే దమ్మలేని వాళ్లకు రాజకీయాలు అనవసరం అంటూ మండిపడ్డారు లోకేష్. సీఎం జగన్ వేసే ముష్టి కోసం ఎన్ని వెధవ పనులైనా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, Tdp

    తదుపరి వార్తలు