Home /News /coronavirus-latest-news /

NANI SUDHEER BABU DIL RAJU MOVIE V MOVIE POSTPONED DUE TO CORONAVIRUS EFFECT TA

Nani: నానిని వెంటాడున్న వరుస కష్టాలు..

నాని వి సినిమా (Nani V movie poster)

నాని వి సినిమా (Nani V movie poster)

హీరో నానిని వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ బెంబేలెత్తుస్తున్న కరోనా వైరస్.. ఇపుడు నానిని వెంటాడుతోంది. అందుకే ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘వీ’ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు సమాచారం.

    హీరో నానిని వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ బెంబేలెత్తుస్తున్న కరోనా వైరస్.. ఇపుడు నానిని వెంటాడుతోంది. తాజాగా ఆయన హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ‘V’ సినిమ ా చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో నాని నెగిటివ్ రోల్ పోషిస్తున్నట్టు ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో నాని కళ్లతోనే విలనిజం చూపించాడు. ఈ సినిమాను ఉగాది కానుకగా ఈ నెల 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడా చూసిన కరోనా భయం విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా థియేటర్స్‌ ప్రేక్షకులు లేక ఈగలు తోలుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇపుడిపుడే కరోనా పై కేసులు నమోదు కావడం వంటివి జరగడంతో సామాన్య జనాలు థియేటర్స్, మాల్స్ వంటి అత్యధిక రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు.

    నాని వి సినిమా పోస్టర్ (Nani V movie poster)
    నాని వి సినిమా పోస్టర్ (Nani V movie poster)


    కరోనా భయానికి తమిళనాడు విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రద్దు చేసారు. మరోవైపు ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి నడుస్తోంది. జనాలు కూడా సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు సినిమాకు రాజ పోషకులైన విద్యార్ధిని విద్యార్థులు పరీక్షల్లో మునిగిపోయారు.  ఇలా కారణాలు వెరసి నాని ‘వి’ సినిమా విడుదలను వాయిదా వేయాలనే నిర్ణయానికి నిర్మాత దిల్ రాజు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కూడా కరోనా వైరస్ భయం తగ్గిన తర్వాత విడుదల చేయాలని కోరుతున్నారట. ఈ రెండు మూడు రోజుల్లోనే ‘వీ’ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Coronavirus, Dil raju, Kovid 19, Nani, Nani V Movie, Sudheer Babu, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు