కరోనా వైరస్‌ వినాశనానికి ఆయుధం ఒక్కటే.. నందమూరి బాలకృష్ణ సందేశం...

కరోనా వైరస్‌ను జయించాలంటే మన వద్ద ఉన్న ఆయుధం సామాజిక దూరం పాటించడమేనని బాలకృష్ణ అన్నారు.

news18-telugu
Updated: April 3, 2020, 6:00 PM IST
కరోనా వైరస్‌ వినాశనానికి ఆయుధం ఒక్కటే.. నందమూరి బాలకృష్ణ సందేశం...
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
  • Share this:
కరోనా వైరస్ మీద ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు, సామాజిక దూరం పాటించేందుకు సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. కరోనా మహమ్మారి వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ నడుస్తోందని, కరోనా వైరస్‌ను జయించాలంటే మన వద్ద ఉన్న ఆయుధం సామాజిక దూరం పాటించడమేనని బాలకృష్ణ అన్నారు. కాబట్టి, ‘సామాజిక దూరంతో కరోనా చచ్చేదాకా పోరాటం చేద్దాం.’ అని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ‘కరోనా ఎవరిని కాటేస్తుందో తెలియడం లేదు. సామాజిక దూరంతో కరోనా చచ్చేదాకా పోరాటం చేద్దాం. కరోనా సర్వనాశనానికి మన ఆయుధం సామాజిక దూరం పాటించడమే. ఎవరి ఇంటి వారు పరిమితం కావాలి. సామాజిక దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.’ అని సూచించారు. కరోనా నివారణ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న వైద్యులు, వైద్యసిబ్బంది, పోలీసులు, ఇతర సంస్థలకు బాలకృష్ణ కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలకు కూడా అభినందనలు తెలిపారు. ఇంతమంది మన కోసం పనిచేస్తుంటే, మనం మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో తప్పులు చేస్తున్నామని బాలకృష్ణ అన్నారు. కరోనా నియంత్రణలో మన బాధ్యత మనం నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: April 3, 2020, 6:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading