కరోనా విజృంభణ వేళ పెళ్లి ముహుర్తం.. ఈ మహిళ వైద్యురాలు ఏం చేసిందో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే..

డాక్టర్ అపూర్వ(ఫైల్ ఫొటో)

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ.. వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు.

  • Share this:
    దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా మంది వైద్యులు తమ వ్యక్తి జీవితాలలోని సంతోషాలను దూరం చేసుకుకి సైతం కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ ముందుకు సాగుతున్నారు. చాలా రోజులు కుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు ఉన్నారు. తాజాగా కరోనా వేళ ఓ మహిళా వైద్యురాలు తన జీవితంలో మదురైన ఘట్టాన్ని రద్దు చేసుకుంది. కరోనా కాలంలో పెళ్లి రద్దు చేసుకుంది. పెళ్లి వాయిదాకు వరుడి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో.. మహిళా డాక్టర ఈ నిర్ణయం తీసుకుంది.

    వివరాలు.. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని సెంట్రల్ ఇండియా కార్డియాలజీ ఆస్పత్రిలో అపూర్వ మంగళగిరి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. అపూర్వ వివాహం ఏప్రిల్ 26 జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో అపూర్వ కుటుంబ సభ్యులు పెళ్లి జరపడానికి సిద్దంగా లేరు. దీంతో పెళ్లి వాయిదా వేసే ప్రపోజల్‌ను వరుడి కుటుంబం ముందు ఉంచారు. అయితే వరుడి కుటుంబం పెళ్లి తేదీని వాయిదా వేసేందుకు నిరాకరించింది. అయితే మహిళా వైద్యురాలు అపూర్వ మాత్రం కరోనా రోగులకు సేవ చేయడానికి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తన పెళ్లిని రద్దు చేసుకుంది.

    ఇక, అపూర్వ తండ్రి గతేడాది సెప్టెంబర్‌లో కరోనా‌తో మరణించాడు. ఆ తర్వాత కుటుంబంలో జరిగిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అపూర్వకు బాగా తెలుసు. అందుకే కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా బాధితులకు అండగా ఉండాలని ఆమె నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా తనలోని సేవ భావాన్ని చాటుకుంది. దీనిపై అపూర్వ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది కోరత ఉందని.. అందుకే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అపూర్వ తెలిపారు. ఇక, అపూర్వ కష్ట సమయంలో ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకోవడం గర్వంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: