Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: March 14, 2020, 6:29 PM IST
నాగబాబు (Nagababu)
ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్‌ను కామెడీ చేస్తున్నారు మన వాళ్లు. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనిపై జోకులు బాగానే పేలుతున్నాయి. చైనాలో కరోనా వస్తే బిల్డింగ్ కట్టారు.. మన దగ్గర కరోనా వస్తే కాలర్ ట్యూన్ పెట్టారు అంటూ మీమ్స్ చేస్తున్నారు. కరోనాను చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు దాని ప్రభంజనం చూసి అంతా నోరెళ్లబెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దీనిపై నాగబాబు కూడా సెటైర్లు వేస్తున్నాడు. ఈయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అది కూడా కాస్త వెటకారంగా ఉండటంతో నాగబాబుపై కూడా సెటైర్లు పేలుతున్నాయి. 'కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే కరోన వైరస్‌ని వాళ్ళ దేవుడే ఈ భూమి మీదకి పంపించాడని అంటున్నారు. అయినా ఈ దేవుళ్ళకి కోపం ఎక్కువే సుమా..' అంటూ సెటైరికల్‌గా నాగబాబు చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుందిప్పుడు.

నాగబాబు (Twitter/Nagababu)
గోమూత్రం తాగితే కరోనా చచ్చిపోతుందట కదా.. వాళ్లే కదా గురూ ఇది చేసింది అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత అదిరింది షోతో చాలా బిజీ అయిపోయాడు నాగబాబు. ఆ కార్యక్రమాన్ని జబర్దస్త్‌కు పోటీగా ఎలా నిలబెట్టాలా అని తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. ఇదిలా ఉంటే ఈ షోతో పాటు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్‌గా ఉంటున్నాడు నాగబాబు. ముఖ్యంగా ఈయన యూ ట్యూబ్‌లో చేసే కామెంట్స్.. ఫేస్ బుక్‌లో పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. మొన్నటికి మొన్న చిరంజీవి రాజ్యసభ సీట్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు. అంత బిజీలో కూడా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ట్వీట్ చేసాడు నాగబాబు.
కరోనా వైరస్ వచ్చిన దానికంటే కూడా వస్తుందేమో అనే భయంతోనే చాలా మంది చనిపోతున్నారు అంటూ ట్వీట్ చేసాడు నాగబాబు. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికరంగా రిప్లై ఇస్తున్నారు. ముఖ్యంగా కొందరు అయితే నాగబాబుతో ఆడుకుంటున్నారు.. ఆయన చేసిన పోస్టుపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. కరోనా స్పెల్లింగ్ తప్పుగా రాశారు.. సరి చేయండి సర్ అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత మరొకరు కూడా కాస్త సెటైరికల్‌గానే స్పందించారు. ఏం మాట్లాడుతున్నారు బాబు గారూ అంటూ ఇంకొందరు కామెంట్ చేశారు. వాళ్లతో పాటు మరికొందరు కూడా కరోనా వైరస్ వస్తుందేమో అనే భయంతో చనిపోతున్నారా.. అయితే ఈ వీడియోలు చూడండి అంటూ కేసీఆర్ మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలను ట్యాగ్ చేస్తున్నారు.
Published by:
Praveen Kumar Vadla
First published:
March 14, 2020, 6:24 PM IST