news18-telugu
Updated: March 3, 2020, 2:07 PM IST
నాగబాబు (Twitter/nagababu)
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి జనసేన నేత, సినీనటుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భూమి మీద మనిషి అనే జీవి పూర్తిగా చస్తే ఈ భూమి, ప్రకృతి, వాతావరణం అద్భుతంగా ఉంటాయని నాగబాబు అభిప్రాయపడ్డారు. మిగిలిన జీవరాసులు చాలా చాలా సంతోషంగా జీవిస్తాయని నాగబాబు వ్యాఖ్యానించారు. సర్వ జీవరాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బతుకుతున్నాయని నాగబాబు అన్నారు. అయితే కరోనా వైరస్ సహా ఒక్క మనిషి తప్ప అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
కొందరు నాగబాబు చేసిన కామెంట్స్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఆ మనుషుల్లో మీరు కూడా ఉన్నారు కదా? అంటూ నాగబాబుకు కౌంటర్ ఇస్తున్నారు. తన అభిప్రాయాలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే నాగబాబు... కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. తాజాగా ఆయన కరోనా వైరస్‌పై కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Published by:
Kishore Akkaladevi
First published:
March 3, 2020, 2:07 PM IST