Covid: నా తల్లికి సీరియస్‌గా ఉంది.. ఆస్పత్రిలో బెడ్ దొరకడం లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే..

Covid: నా తల్లికి సీరియస్‌గా ఉంది.. ఆస్పత్రిలో బెడ్ దొరకడం లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే..

ఫ్రతీకాత్మక చిత్రం

ఓవైపు కరోనా వైరస్ కేసులు పెరుగుతూంటే.. మరోవైపు చాలా మంది రోగులకు సరైన చికిత్స అందని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

  • Share this:
    దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఓవైపు కరోనా వైరస్ కేసులు పెరుగుతూంటే.. మరోవైపు చాలా మంది రోగులకు ఆస్పత్రులలో సరైన చికిత్స అందని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. సామాన్యులకే కాకుండా చాలా మంది ప్రముఖులు కూడా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా ఆస్పత్రుల ఎదుట.. బెడ్స్ ఖాళీగా లేవనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రముఖుల కుటుంబ సభ్యులకు కూడా ఆస్పత్రిలో బెడ్స్‌ దొరకడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ఈ పరిస్థితులను ఎదుర్కొలేక ఇక్కట్లు పడుతున్నారు. బెడ్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన లాభం లేకపోవడంతో తీవ్ర మనోవేధనకు గురవుతున్నారు.

    ఈ నేపథ్యంలో కరోనాతో బాధపడుతున్న తన తల్లి ఆరోగ్య పరిస్థితి‌ గురించి చెబుతూ ఓ మహిళ ఎమ్మెల్యే ఏమోషనల్ అయ్యారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జరుగుతున్న ఓ వీడియా కాన్ఫరెన్స్‌లో ధార్వాడ జిల్లా కుందగోళ ఎమ్మెల్యే కుసుమ శివళ్లి కంటతడిపెట్టారు. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్న సమయంలో ఒక్కసారిగా తన పరిస్థితిపై బోరున విలపించారు. తన తల్లిని కిమ్స్‌(Karnataka Institute of Medical Sciences)లో చేర్చుకోవడానికి అనుమతి నిరాకరించారని తెలిపారు. ఈ సంఘటనతో కాంగ్రెస్ నేతలు చలించిపోయారు.

    దీనిపై వెంటనే స్పందించిన సిద్దరామయ్య.. కిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడుతానని భరోసానిచ్చాడు. ఇందుకు సంబంధించి సిద్దరామయ్య రిపోర్టర్స్‌తో మాట్లాడుతూ.. ‘ఆమె తల్లి కరోనాతో పోరాడుతుంది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యురాలికి కిమ్స్ హుబ్లీ బెడ్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఒక ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. రాష్ట్రంలో పేద ప్రజల పరిస్థితి ఏమిటి’అని ప్రశ్నించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు