హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Telangana: రియల్ హీరోస్.. కరోనా మృతులకు అంత్యక్రియలు.. మానవత్వం చాటుకున్న ముస్లిం యువకులు.. ఎక్కడంటే..

Telangana: రియల్ హీరోస్.. కరోనా మృతులకు అంత్యక్రియలు.. మానవత్వం చాటుకున్న ముస్లిం యువకులు.. ఎక్కడంటే..

కార్యక్రమంలో పాల్గన్న ముస్లిం సోదరులు

కార్యక్రమంలో పాల్గన్న ముస్లిం సోదరులు

Telangana: కరోనా సోకిందంటేనే సొంత బంధువులు సైతం దగ్గరకు రాని పరిస్థితి. అలాంటిది ఆ రోగి చనిపోతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో మేమున్నామంటూ ముందుకొచ్చి వారి అంత్యక్రియలను పూర్తి చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నలుగురు ముస్లిం సోదరులు చేసే పనికి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్, న్యూస్ 18 తెలుగు)

  కరోనా తో మృతి చెందిన వారికి వారి కుటుంబం రాకపోవడంతో స్వయంగా వారి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు ఆ ముస్లిం యువకులు. బంధువులు కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నా.. వీరు ముందుకు వచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్ మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఒంటరిగా ఉంటున్నారు. ఇటీవల ఆయనకు కరోనా రావడంతో నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో కొద్ది రోజులు చికిత్స పొంది ఎవరికీ చెప్పకుండా వచ్చేశాడు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అమ్రాబాద్ నుంచి తిరుమలాపురం వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో అక్కడే ఓ పాత ఇంటి ముందు పడుకున్న అతను నిద్రలోనే మృతి చెందాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో అమ్రాబాద్ కు చెందిన నలుగురు ముస్లింల యువకులు ముందుకొచ్చి వైద్య అధికారి నాగరాజు ఇచ్చిన పి పి ఈ కిట్లును ధరించి మృతదేహాన్ని ట్రాక్టర్ ద్వారా తిరుమలాపురం గ్రామానికి తరలించి ఖననం చేశారు.

  వారికి సర్పంచ్ శారద ఎస్ఐ వెంకటయ్య సహకారం అందించారు. యువకుల సేవాభావాన్ని పలువురు అభినందించారు. అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి లోను కరోనాతో ఇద్దరు మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో సర్పంచ్ ఆధ్వర్యంలో పి పి ఈ కిట్లను ధరించి పంచాయతీ టాక్టర్లు ద్వారా మృతదేహాలను తరలించి శ్మశాన వాటిక వద్ద అంత్యక్రియలు నిర్వహించారు.

  దీంతో మండల పరిధిలోని ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే ముస్లిం యువకులు అక్కడికి చేరుకుని వారి సాంప్రదాయ ప్రకారమే కార్యక్రామాలు పూర్తి చేస్తున్నారు. వీరి సేవ పట్ల అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అభినందిస్తున్నారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Amrabad, Corona, Corona cases, Covid-19, Furneal, Mahabubnagar, Muslim brothers

  ఉత్తమ కథలు