హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

తబ్లిగి జమాత్ మీద ముస్లింల సెంటిమెంట్... కరోనా వ్యాప్తికి దోహదం

తబ్లిగి జమాత్ మీద ముస్లింల సెంటిమెంట్... కరోనా వ్యాప్తికి దోహదం

ఇక ఈ ఏడాది సామూహిక ఈద్ ప్రార్థనలకు సైతం అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇక ఈ ఏడాది సామూహిక ఈద్ ప్రార్థనలకు సైతం అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.

ముస్లింలు తమ ఆధ్యాత్మిక జీవనంలో మరింత ఉన్నతంగా సాగడానికి తబ్లిగి జమాత్ వారిని ఎడ్యుకేట్ చేస్తుంటుంది.

  (మీకత్ హష్మి, సీనియర్ సబ్ ఎడిటర్, న్యూస్18) 

  ఢిల్లీలో తబ్లిగి జమాత్ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిలో ఆరుగురు సోమవారం రాత్రి చనిపోవడంతో దేశవ్యాప్తంగా ఓ రకంగా రెడ్ అలర్ట్‌గా మారిపోయింది. ఓ వైపు లాక్ డౌన్ మీద ప్రజలు అసంతృప్తితో ఉండగా, నిజాముద్దీన్ కార్యక్రమం ద్వారా మాత్రమే ఎందుకు ఇలా జరిగిందని ముస్లిం సమాజం ప్రశ్నించుకుంటోంది. సోమవారం అర్ధరాత్రి నుంచే సోషల్ మీడియాలో ‘కరోనా జిహాద్’ అంటూ ట్రెండింగ్ చేయడం మొదలు పెట్టారు. యాత్రికులు వైష్ణోదేవిలో చిక్కుకున్నారు. ముస్లింలు నిజాముద్దీన్‌లో దాక్కున్నారు.’ అని ప్రచారం చేస్తున్నారు.

  షహీన్ బాగ్‌లో స్థానికంగా ఉండే ఓ వ్యక్తి మాట్లాడుతూ ‘CAA వ్యతిరేక ఆందోళనలు ఇప్పటికే ముస్లిం సమాజం మీద ఓ రకమైన ముద్ర వేశాయి. ఇప్పుడు తబ్లిగి జమాత్ లాంటి గొప్ప సంస్థ పరువు కూడా మసకబారింంది.’ అని అన్నారు. ‘ఓ సంస్థగా తబ్లిగి జమాత్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందనుకుందాం. ఆ సమావేశాలకు హాజరయ్యేందుకు విదేశాల నుంచి వచ్చే వారిని విమానాశ్రయాల్లో స్కానింగ్ చేయాల్సింది ప్రభుత్వం. కనీసం ప్రభుత్వమైనా కరోనా బారిన పడిన దేశాల నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్ నిర్వహించాల్సింది.’ అని తబ్లిగి జమాత్‌తో అనుబంధం ఉన్న 28 ఏళ్ల యువకుడు అభిప్రాయపడ్డారు. తబ్లిగి జమాత్ తమ పరిస్థితిని సంబంధిత అధారిటీకి నిర్ణీత సమయంలోనే తెలియజేసినప్పటికీ, ఇప్పుడు మొత్తం ముస్లిం సమాజం మొత్తం నిందలకు గురవుతోందని ఆవేదన చెందుతోంది. అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోకుండా, ఆదేశాలను ధిక్కరించి, ఉద్దేశపూర్వకంగా ఎక్కువ మంది గుమిగూడారని నిందిస్తున్నారని ఆ యువకుడు అన్నారు.

  ‘ఇలాంటి హెల్త్ సంక్షోభం సమయంలో పోలరైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే, ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుతోంది.’ అంటూ జమాత్ ఇ ఇస్లామీ హింద్, స్టూడెంట్స్ ఆఫ్ ఇస్లామ్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థల పేరుతో పెద్ద ఎత్తున వాట్సాప్ మెసేజ్‌లు తిరుగుతున్నాయి.

  తబ్లిగి జమాత్ తర్వాత వెలుగులోకి వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల వివరాలతో మార్చి 31వ తేదీన ఉర్దూ దినపత్రిక ఇంక్విలాబ్ ఢిల్లీ ఎడిషన్‌లో మొదటి పేజీలో పావు వంతు భాగాన్ని కేటాయించింది. అయితే, బుధవారం నాడు ఫ్రంట్ పేజీ మొత్తం దీనికి సంబంధించిన అంశాలకు కేటాయించింది. ‘ఇది తప్పులు ఎంచుకునే సమయం కాదు.’ అని వైద్య శాఖ స్టేట్‌మెంట్‌ను కూడా అది ప్రచురించింది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న సియాసత్ దినపత్రిక మీడియాను నిందించింది. ‘జరిగిన ఘటనకు మీడియా సంస్థలు మతం రంగు పులుముతున్నాయి.’ అంటూ హెడ్ లైన్‌లో ఆక్షేపించింది. కాశ్మీర్ నుంచి వెలువడే ఉజ్మా దినపత్రిక తబ్లిగి జమాత్ క్లారిఫికేషన్‌ను కూడా తీసుకుంది. శ్రీనగర్ నుంచి వెలువడే మరో ఉర్దూ పత్రిక ‘అఫ్తాబ్‌’ తబ్లిగి జమాత్ ‘బాధ్యతారాహిత్యాన్ని’ ముస్లిం సంస్థలు ఖండించినట్టు ప్రచురించింది.

  ముస్లింలు తమ ఆధ్యాత్మిక జీవనంలో మరింత ఉన్నతంగా సాగడానికి తబ్లిగి జమాత్ వారిని ఎడ్యుకేట్ చేస్తుంటుంది. మత పరమైన కార్యక్రమాలను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనే అంశాలను అక్కడ ఎక్కువగా నేర్పిస్తుంటారు.

  తబ్లిగి జమాత్ నిర్వహించే కార్యక్రమం ఓ పిరమిడ్ సేల్స్ స్కీమ్ తరహాలో ఉంటుంది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉన్న బంగ్లే వాలీ మసీదులో కార్యక్రమాలకు హాజరైన వారంతా ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వెళ్తారు. పది, పది మంది చొప్పున ఓ బృందంగా ఏర్పడతారు. స్వస్థలాలకు వెళ్లిన తర్వాత ఆ బృందాలు మరింత చిన్నవవుతాయి. ఓ నలుగురు సభ్యులు ఉంటారు. వారి ప్రచారం అంతా డోర్ టు డోర్ ఉంటుంది. ముఖ్యంగా ముస్లింలను నమాజ్‌కు రావాలని పిలుస్తారు. వారిని అనుసరించే వారికి ఇస్లాం గురించి బోధిస్తారు. ఆ తర్వాత వారిన వాలంటీర్లుగా మారాలని కోరతారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Coronavirus, Muslim Minorities, New Delhi

  ఉత్తమ కథలు